Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.10.2021
Share:

By Village Missionary Movement

Monday, 04-Oct-2021

దిన ధ్యానము(Telugu) 04.10.2021

 

అంశం:- సింహం.

 

"శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు" - సామెతలు 24:10

 

డిస్కవరీ ఛానల్లో జంతువుల రాజు అయిన సింహం గురించి చూపిస్తున్నారు. మిగతా అన్ని జంతువుల్లో లేని అనేకమైన ప్రత్యేకతలు సింహంలో ఉన్నాయి. శారీరకంగా కాదు హృదయంలో కూడా రాక్షస బలం కలిగి ఉండటమే దీని ప్రత్యేకత. సింహం తన సమూహంతో కాదు తాను ఒంటరిగా ఉండినను దేనిని చూసి కూడా బయపడదు. భయం, అలసట, లొంగిపోవుట అనే ఎటువంటి ఒడిపోవుట అనే స్వభావం సింహంలో మనం చూడలేము. పది జంతువులు కలిసి ఎదిరించిన సరే సింహం ఒంటరిగా ఎదురుగా నిలబడుతుంది. పరిశుద్ద గ్రంధం సింహం గురించి ఎల్ల మృగములలో పారాక్రమము గలదై దేనికి భయపడి వెనుకకు తిరుగుదు అని దేవుని మాటల్లో చెప్పబడింది. 

 

ఈరోజు మీరు ఏదో ఒక విషయంలో బాధపడుచు ఉన్నారా? మరి దేవుడు సింహం గురించి దేవుడు చెప్పింది విన్నారు కదా. ఒక మృగానికి ధైర్యమును, గంబిరమును దేవుడు ఇచ్చారు అంటే మరి తన పోలిక చొప్పున సృష్టించిన మనుష్యునికి ఎంత అధికముగా బలమును ఇస్తారు అనే దానిని ఆలోచించి చూడండి. అదే విధముగా అపోస్తూలుడైన పౌలు ఫిలిప్పియులకు వ్రాసిన పత్రికలో 4 అధ్యాయంలో 13 వ వచనములో ఈ విధముగా వ్రాస్తున్నారు. నన్ను బలపరుచు వానియందు నేను సమస్తమును చేయగలను అని. తన యొక్క క్రైస్తవ జీవితంలో ఒక్కసారి కూడా తాను ఆధైర్యపడే విదంగా మాట్లాడలేదు. బదులుగా తన బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణం అగుచున్నది అన్నారు. కావున దీనిని చదువుతున్న ఏ ఒక్కరు కూడా దేనిని గూర్చి కలత చెందవద్దు. ఈ నాటి ధ్యాన వాక్యములో శ్రమ దినమున నీవు కృంగిన యెడల నీవు చేతకానీ వాడవు అగుదువు అని చదుకున్నాము. మనము ఊహించని స్థితిలో కొన్ని అపత్తులను, ప్రమాదములను చూసి మానసికంగా కృంగిపోతున్నాం. సమూయేలు మొదటి గ్రంధం 30వ అధ్యాయంలో దావీదు చాలా భయంకరమైన ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. ఇక్కడ దావీదు ఆధైర్య పడకుండా యెహోవా పక్షమున తన్ను తాను బలపరుచు కున్నాడు అని మనము చదువుతున్నాం. శ్రమ దినాల్లో కృంగి పోకూడదు. దేవుని వాక్యము చదవండి, ధ్యానించండి మన ప్రభువు మనకు ఇచ్చే బలముతో మిమ్మును నూతన పరుచుకొనండి. 

- బ్రదర్. పి.జాకబ్ శంకర్

 

ప్రార్థన అంశం:-

యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా ప్రకటించబడుతున్న దేవుని వాక్యం ద్వారా క్రీస్తుని ఎరుగని ప్రజలు రక్షించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet