Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.10.2021
Share:

By Village Missionary Movement

Friday, 08-Oct-2021

దిన ధ్యానము(Telugu) 08.10.2021

 

అంశం:- బొటని వేలు

 

"జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు కొనుము" - సామెతలు 4: 7

 

రిచర్డ్ ఉమ్రాన్ట్ దేవుడు లేడని నమ్ముతున్న రష్యా ప్రజల మధ్య పనిచేస్తున్నప్పుడు విగ్రహములను తయారు చేస్తున్న దంపతులను కలుసుకున్నారు. వారు ప్రభువును ఎలా అంగీకరించారో విందాం. ఒక విగ్రహమును చేస్తున్నప్పుడు ఆమె అతనిని చూస్తూ మన చేతిలో ఉన్న బొటనివేలు గురించి ఏమనుకుంటున్నారు? ఈ బొటనివేలు మిగతా వేళ్ళ వలె వ్యతిరేకముగా ఉండకుండా కాళ్ళ వేళ్ళ వలె ఒక వరుసలో ఉండి ఉంటే సుత్తులను ఏ ఒక్క వస్తువునైన, పుస్తకములను లేదా రొట్టె ముక్కలను కూడా నేను చేతులతో తీయలేను సాధారణ మనుష్యుని జీవితంలో ఈ చిన్న బొటనివేలు లేకపోతే సాధ్యమవదు. ఈ బొటనివేలును తెలివిగా సృష్టించిన వారెవరు? భూమి , ఆకాశము వాటంతట అవే కలిగాయి అని పాఠశాలలో చదివి తెలుసుకున్నాం. అవి దేవుని ద్వారా సృష్టించబడినవి కావు అని నేను ఈ రోజు వరకు నేను నమ్ముతూ వచ్చాను. ఆ విదముగానే దేవుడు భూమిని, ఆకాశమును సృష్టించిన వారు అని కాకుండా బొటనివేలు సృష్టించిన వారివలే ఆయన నమ్మదగిన వారే. మిమ్ సారా- బల్బ్, టెలిఫోన్ సాధనం, రైలు వంటి వాటిని కనుగొన్న ఎడిసన్ పిల్స్ స్టీఫెన్సన్ వీరిని మనం పొగిడినప్పుడు బొటనివేలుని కనుగొన్న వారిని ఎందుకు మనం పొగడకూడదు. ఎడిసన్ కు బొటనివేలు లేకపోయి ఉంటే అతను దేనినికూడా కనుగొనలేడు అందువలన బొటనివేలుని చేసిన దేవుణ్ణి ఆరాధించుట సరియైనదే అని భార్య చెప్పింది. అనేక సమయాలలో భార్యలు తెలివిగా మాట్లాడినప్పుడు భర్తలకు కోపం వచ్చినట్లు ఇది విన్న తన భర్తకి కూడా చాలాకోప పడి. ఇలా బుద్ధిహీనంగా మాట్లాడవద్దు అని అన్నారు. కాని భార్య జ్ఞానము గల ప్రశ్న అతనిని ప్రభువైపు త్రిప్పింది. 

 

పరిశుద్ధ గ్రంధంలో చూసినప్పుడు యెహోవా సొలొమోనుకు స్వప్న మందు ప్రత్యక్షమై నేను నీకు దేనివిషయమై దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమని చెప్పినప్పుడు నాకు వివేకము గల హృదయము దయచేయుము అని అడిగాడు ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. 

 

దేవుని పిల్లలారా! మనం జ్ఞానము లేకుండా చేసిన పనుల నిమిత్తం చాలా సమస్యలలో చిక్కుకు పోతున్నాం. సొలొమోనును చూసినట్లయితే దేవుని యొద్ద తను జ్ఞానమును అడిగాడు మనం మన ప్రార్ధనలో దేవుణ్ణి ఏమి అడుగుతున్నాం. కొంచం ఆలోచించి చూద్దాం. జ్ఞానం చాలా ముఖ్యం ప్రతిరోజు యేసుక్రీస్తు యొద్ద జ్ఞానమును అడిగి దాని ప్రకారంగా నడుచుకొనుటకు మనలను సమర్పించుకుందాం. 

- సహోదరుడు. పి.శివ గారు

 

ప్రార్ధనా అంశం:-

మీడియా సేవల కొరకు అవసరమైన వస్తువులను కొనుట కొరకు ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet