Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.10.2021
Share:

By Village Missionary Movement

Monday, 11-Oct-2021

దిన ధ్యానము(Telugu) 12.10.2021

 

అంశం:- ఆస్థిని సమకూర్చుట.

 

"యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు." - సామెతలు 14: 26

 

మన జీవితంలో మన పిల్లలు చాలా ప్రాముఖ్యమైన వారు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్థిని సంపాదించుట అనేది నిజమే కాని దానికంటే ఒక ప్రాముఖ్యమైన పని కుటుంబంలో కనిపించాలి. అదేమిటంటే దేవునికి భయపడే భయం. మనం దేవునికి భయపడి ఆయన మార్గంలో నడుస్తూ ఒక మంచి జీవితం జీవిస్తే అది మన పిల్లలకు ఆశ్రయముగా మారుతుంది. కోట్లకోలది ధనం, అంతస్తులు గల ఇల్లు , ఖరీదైన తుపాకీలు ఇవ్వలేని కాపుదల , దేవుడు ఇచ్చే ఆశ్రయం మాత్రమే ఇస్తుంది. ఈ కాపుదల 1000తరాల వరకు కొనసాగుతుంది. దేవుని ఆశ్రయం వలన ఆహారం, ధరించే దుస్తులు, అవసరమైన చదువు, వ్యాధిలేని జీవితం , మంచి సంతోషకరమైన కుటుంబ జీవితంతో వారు ఆశీర్వదింపబడి ఉంటారు. 

 

పరిశుద్ధ గ్రంధంలో రూతుని గురించి మనం చదివినప్పుడు ఆమె తన అత్తను అభినందిస్తూ బ్రతికింది అని చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించిన సరే తన క్రియల వలన దేవునికి ఇష్టముగా నడిచి విధవ అయిన తన అత్తను ఆదరించి ఆమెతో బ్రతికి ఆమెను చూసుకుంటూ వచ్చింది. ఈ మంచి లక్షణం బోయజుకు తెలియజేయబడింది. అందుకు బోయజు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. అని ఆశీర్వదించాడు. రూతు బోయజుకి పుట్టిన , ఓబేదు వంశములోనే దావీదు ,యేసుక్రీస్తు పుట్టారు. ఎంత అద్భుతమైన జీవితం రూతు కు గొప్ప ఆధిపత్యం కూడా దొరికింది. 

 

స్నేహితులారా! ఈరోజు మనం యెహోవా యొక్క ఆజ్ఞలకు, వాక్యముకు భయపడి మన ఇంటిలో ఉన్న పెద్దవారిని ఆధరిస్తున్నమా? నీ తల్లిని తండ్రిని ఘనపరచుము అనే ఆజ్ఞను గైకొని పాటిస్తున్నామా? వారి పట్ల ఎలా నడుచుకుంటున్నాం. మనం ఎలా చేస్తామో మనకు అలానే చేయబడుతుంది. మన పిల్లలకు ఆశ్రయం ఎవరిద్వారా కలుగుతుంది? భక్తి గల తల్లిదండ్రుల ద్వారానే కదా అని అర్ధం చేసుకోవాలి. మనం దేవునికి లోబడి జీవించి మన వెనుకవచ్చే సంతతికి ఆశీర్వాదమును పెంచుతూ వద్దాం. ఆమెన్.  

- శ్రీమతి. భువనా ధన బాలన్

 

ప్రార్థన అంశం

7000 మిషనరీల ద్వారా ఒక లక్ష గ్రామాలు సంధింపబడాలి అనే ప్రణాళికలు అన్ని రాష్ట్రాల నుండి 12మంది మనతో కలవాలని ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet