Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.10.2021
Share:

By Village Missionary Movement

Saturday, 16-Oct-2021

దిన ధ్యానము(Telugu) 16.10.2021

 

అంశం:- భయం అనే ఉరి.

 

"భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును" - సామెతలు 29: 25

 

ఇది ఒక తమాషా కద. ఒక భార్య తన భర్తను ప్రజలతో రద్దీగా ఉన్న జూ పార్కులో వెంటాడుతూ వెళుతూ ఉంది. చేతిలో గొడుగు నోటితో భయంకరమైన మాటలతో వెంటాడుతూ వెళ్తుంది. ఆమెకు భయపడుతూ వెళ్తున్న భర్త చెమటలు పడుతూ ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాక సింహం ఉండే బోను తాళం వేయకుండా ఉండుట చూచి దానిలోనికి వెళ్లి తన వెనుక తలుపును వేసేసాడు. దానిని చూసిన సింహం భయపడి బోను యొక్క చివరిన చేరబడి అతనిని చూస్తుంది. అంతలో అక్కడికి వచ్చి తాను సింహపు బోనులో ఉండుట చూసిన తన భార్య ఓయ్ పిరికివాడ దమ్ముంటే బయటకు రా అని పిలిచింది. బోనులో ఉన్న ఆయన పిరికివాడైతే ఆమె సింహం కంటే ఎంత భయంకరమై ఉండి ఉంటుంది. 

 

ఇశ్రాయేలీయులు ఎవరికి భయపడాలి అనే దానిలో తికమక చెందిన వారి వలె ఉన్నారు. యెహోవా వారికి వాగ్దానం చేసిన కనాను దేశము వేగు చూచుటకు వెళ్లిన 12 మందిలో 10 మంది అలానే ఆదేశము మమ్ములను భక్షించు దేశము కావున వారి ముందు మేము మిడతల వలె ఉంటిమి అని అన్నారు. వారు చూసిన మనుష్యులు గురించి వారికి అంత భయం. వారు బలశాలులుగా ఉన్నందున ఇశ్రాయేలీయులు వారిని ఎదురించ లేము అని పిరికివారిగా తీర్మానించుకున్నారు. వారి యొక్క బలము యెహోవాయే అని వారు మర్చిపోయారు. వారి యొక్క అవిశ్వాసము యొక్క ఫలితముగా ఇశ్రాయేలీయుల అందరిని వణికించడం మాత్రమే కాకుండా ఆ సంతతిని కానాను దేశం సొంతం చేసుకోకుండా చేశారు. కాని వారిని సులభంగా ఎదుర్కొనగలము అని యెహోవా మీద నమ్మకం ఉంచిన యెహోషువ మరియు కాలేబు మాత్రమే తమ్మును సమర్పించు కొని కానాను దేశంను చేరుకున్నారు. 

 

భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును అనే వాక్యం ద్వారా మనుష్యులకు భయపడినట్లయితే యెహోవా మీద మనకు నమ్మకం ఉండదు. ఆయన వాగ్దానాలు, ఆయన ప్రణాళికలు ఆయన బలము పైన కూడా మనకు నమ్మకం ఉండదు. భయ పడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును కాని యెహోవా మాత్రమే అందరి కంటే భయపడదగిన వారు. ఆయన చిత్తం లేకుండా ఏమియు జరగదు అనేది మర్చిపోతున్నాం. యెహోవాను నమ్మితే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కరు మాత్రమే నమ్మదగిన వారు. ఆయనను మాత్రమే మనం నమ్మి ఆయనకు లోబడాలి. అప్పుడు మనం ఉన్నత స్థానంలో ఉంచబడతాం. 

- శ్రీమతి. వసంతి రాజ్ మోహన్

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణం నెలవారీ వార్తలను ముద్రించుటకు అవసరమైన వస్తువుల అవసరతలు సందించ బడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort