Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.10.2021
Share:

By Village Missionary Movement

Sunday, 17-Oct-2021

దిన ధ్యానము(Telugu) 18.10.2021

 

అంశం: ప్రేమ మరియు గద్దించుట.

 

"బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును" - సామెతలు 29:15

 

ఈరోజు వరకు అనేక కుటుంబాలలో తల్లిదండ్రులకు కలిగే ప్రశ్న పిల్లలను కొట్టి గద్దించి పెంచడం సరైనదా లేక తప్పైనదా. దీని వలన భర్త భార్యల మధ్య గొడవ వస్తుంది అని చెబుతున్నారు. ఈ ప్రశ్నకు జవాబు పరిశుద్ద గ్రంధంలో వెతకడం చాలా మంచిది. పరిశుద్ద గ్రంధం చెబుతున్నది ఏమిటి పిల్లలు తప్పు చేసినప్పుడు గద్దించవచ్చు. అది వానిని పాతాలమునకు పోకుండా తప్పించును మరియు జ్ఞానమును కలుగజేయును. కాని చిన్న పిల్లల కార్యములను అర్థం చేసుకొనక ముందే కన్నవారు వారిని కొడతారు. పిల్లలు ఏడ్చినప్పుడు దెబ్బలు పడతాయి. ఒక వేళ వారు వ్యాధి వలన ఏడ్వవచ్చు లేక భయపడి ఏడ్వవచ్చు లేక ఏదైనా పురుగు కరిచి ఏడ్వవచ్చు. కాబట్టి చిన్న పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియ కుండా కొట్టకూడదు. మూడు సంవత్సరాల వయస్సు తరువాతే పిల్లలకు మనం చేసేది తప్పు అని తెలుస్తుంది. అప్పుడు తప్పు అని తెలిసినప్పుడు మొదట ప్రేమతో గద్దించి మాట్లాడాలి. దాని వలన వారు వినకపోతే అప్పుడు కొట్టాలి. యవ్వన వయస్సుకు వచ్చిన తరువాత కుమార్తె నైనా కుమారుడ్ని అయిన కొట్టడం మంచిది కాదు. గద్దిస్తే సరిపోతుంది. యవ్వనులను కొట్టడం వలన వారు వినే అవకాశం లేదు వారు అవమానము చెంది నట్లుగా అనుకుంటారు. ఇంకా హృదయం కఠినమై కోపం, మూర్ఖత్వం అధికమౌతుంది. అందువలన వారిని గద్దించి దేవుని యొద్ద వారి యొక్క మార్పు కొరకు ప్రార్ధించండి. దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు. 

 

విదేశీయుల పిల్లలు పాడైపోవడానికి గల కారణం వారిని గద్దించి పెంచక పోవడమే. ప్రభుత్వ చట్టాలు కూడా వారికి అనువుగానే ఉన్నాయి. మన భారత దేశ సంస్కృతి ఈ విషయంలో ఉన్నతమైనది. అయినా సరే మన యొక్క గమనం కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు ఉండకూడదు. మన తల్లిదండ్రులు మనలను ప్రేమిస్తున్నారు కాబట్టే మనలను గద్ధిస్తున్నారు అనే నమ్మకం, విశ్వాసం పిల్లల నుండి పుట్టాలి. భర్త పిల్లలను గద్దించి నప్పుడు భార్య పిల్లలను గారాబం చేయకూడదు. ఒకరు గద్దించే విధానం ఇంకొకరికి నచ్చకపోతే ఇద్దరు ఒంటరిగా దాని గురించి మాట్లాడి తీర్మానం తీసుకోవాలి. పిల్లల ముందు తండ్రి క్రియలను నిందించినట్లయితే ఏ విషయంలో అయిన తండ్రి పై పిల్లలకు నమ్మకం ఉండదు. ఒకరు గద్దించి నప్పుడు ఇంకొకరు మౌనంగా దానిని అంగీకరించాలి. దాని వలన అమ్మ, నాన్న ఇద్దరు కూడా అన్ని విషయాల్లో ఒకే విధంగా నడుచుకొనుట పిల్లలు అర్థం చేసుకుంటారు. ఈ విధముగా పిల్లలను గద్దించే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఒక మంచి జనరేషన్ అభివృద్ధి చేయగలం. 

- బ్రదర్. జె. సంతోష్

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణం నెల వారి వార్తలను వ్రాస్తున్న వారికి దేవుడు ప్రత్యేకమైన జ్ఞానంతో నింపే లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet