Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.10.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 19-Oct-2021

దిన ధ్యానము(Telugu) 19.10.2021

 

అంశం: సరస్సులో బుడగలు.

 

"నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు" - సామెతలు 3: 11

 

ఒక చిన్న పిల్లాడు ఆడుకునే పడవను ఒక చిన్న సరస్సులో వదిలి ఆడుకుంటున్నాడు. తాను ఒడ్డున ఉండి ఆడుకుంటున్నప్పుడు ఆ పడవ తన చేతికి అందనంత దూరంగా వెళ్ళి పోయింది. అయ్యో నేను ఏం చెయ్యాలి అని దిగులు పడుతున్న సమయంలో తన కంటే పెద్దవాడు ఆ స్థలము దగ్గరకు వచ్చాడు. వెంటనే ఈ బాబు అన్నా నా పడవ దూరంగా వెళ్ళిపోయింది ఎలాగైనా ఆ పడవను తీసి ఇవ్వండి అని అడిగాడు. వెంటనే ఆ పెద్దవాడు ఒక్క మాటకూడా చెప్పకుండా ఒడ్డున ఉన్న రాళ్ళను తీసి ఆ పడవ వైపు విసరడం ప్రారంభించాడు. ఈ చిన్న వాడు నేను సహాయం అడిగితే మరి అన్న దాని వైపు రాళ్ళను విసురుతున్నాడు.కాని తాను కొంచం సేపు ఓపికగా చూసినప్పుడు ఆ రాళ్లు ఆ పడవ పైన పడకుండా ప్రక్కన పడి చిన్న చిన్న కెరటాలు ఏర్పరిచి ఆ పడవను దరి వైపు తీసుకు వచ్చాయి. ప్రతి రాయి చక్కగా సరైన స్థలములో వేయడం వలన ఏర్పడిన కెరటాలు ఆ పడవను ఒడ్డుకు చేర్చి ఆ చిన్నవాడి చేతికి ఆ పడవను అందేటట్లు చేసింది. 

 

కొన్ని సమయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలను మన జీవితానికి అనుమతిస్తారు అని మనం కలత చెందుతాము. మనం ఎల్లప్పుడు ఆయనను విడిచి తొలగి పోయిన వారి వలె వుండటం వలన ప్రభువు మనలను ఆయన దగ్గరకు చేర్చు కొనుట కొరకు మనకు కొన్ని శ్రమలను పంపిస్తున్నారు. బెత్తము వాడని వాడు తన కుమారుడికి విరోధి. మన జీవితంలో ఏర్పడే శ్రమలు దేవుడు మనలను ప్రేమించడం వలన మనలను ఆయనకు దగ్గరగా చేర్చు కోవడం కొరకే అనుమతిస్తున్నారు అనే దానిని మనం గ్రహించాలి. దానిని అల్పముగా ఎంచు కొనకుండా ఆ శ్రమను ఎందు నిమిత్తం అనుమతిస్తున్నారు అనే దానిని గ్రహించి మనలను త్రిప్పుకొనుటకు ప్రయత్నిద్దాం. మన ప్రయోజనము కొరకు ఆయన పైన అనుకొని జీవించాలి అని ప్రభువు మనకు అనుమతిస్తున్న శ్రమల కొరకు ఆయనను స్తుతిద్దామా. ఆయన పైన ఆనుకొని ఇంకా ఆయన యొద్దకు వెళదామా. 

- బ్రదర్. హరీష్ శామ్యూల్

 

ప్రార్థన అంశం:-

సేవకులకొరకు తమిళంలో ముధ్రించ బడుతున్న నెలసరి మాగజైన్ చదువుతున్న వాళ్లకు ప్రయోజనకరంగ ఉండేటట్లు ప్రార్థించండి

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort