Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.10.2021
Share:

By Village Missionary Movement

Friday, 22-Oct-2021

దిన ధ్యానము(Telugu) 22.10.2021

 

అంశం: వయస్సు ఆటంకం కాదు.

 

"నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు" - సామెతలు 11:30

 

కేన్సర్ వ్యాధి నుండి స్వస్థత ఇచ్చిన దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని ఒక వయస్సు అయిన తల్లి అనుకున్నారు. అప్పుడు సంఘంలో సేవకుడు ఆత్మల సంపాదన యొక్క ప్రాముఖ్యతను గూర్చి వాక్యం చెప్పారు. దానిని విన్న ఆమె తన శక్తి కొలది ఆత్మలను దేవుని కొరకు సంపాదించుటకు ప్రయత్నం చేస్తాను అని మనస్సులో తీర్మానం తీసుకున్నారు. ఇంటికి వెళ్ళి ఒక చెక్క పలకను తీసుకొని దానిపై సమాధానం లేని వారు, ఆరోగ్యం లేనివారు ఇక్కడకు రావచ్చు వారి కొరకు ప్రార్థన చెయ్యబడుతుంది అని వ్రాసి దానిని తన ఇంటి ముందు ఉన్న చెట్టుకు తగిలించారు. వారి ఇంటి సమీపంలో కళాశాల మరియు వైద్యశాల ఉండేవి. అనేక మంది విద్యార్థులు తమ చదువు కొరకు, సమాధానం కొరకు ఆ తల్లి యొద్దకు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్లే వారు. వైద్యుల ద్వారా చెయ్యి విడువబడిన వారు వచ్చి ప్రార్థన ద్వారా అద్భుతమైన స్వస్థత పొందుకొని వెళ్లేవారు. దాని వలన అనేక మంది యవ్వనులు, వ్యాధిగ్రస్తులు రక్షించబడి సంఘంలో చేర్చుకొన బడ్డారు. 

 

 నయమాను అనే సైన్యాదిపతి కుష్టు రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు తన వలన ఇశ్రాయేలీయుల దేశం నుండి చెరగొని తీసుకు రాబడిన చిన్నది అతని యొక్క విడుదలకు మార్గం చెప్పింది. అతను కూడా ఆ చిన్నది చెప్పిన ప్రకారంగా దేవుని ప్రవక్త అయిన ఏలీషా యొద్దకు వచ్చి యెర్దాను నదిలో 7 మార్లు మునిగి స్వస్థత పొందుకొని రక్షించబడి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ చిన్నది తనను బానిసగా చెరగొని తెచ్చిన వారు బాధపడుటను చూచి సంతోషపడక అతని శ్రమను తీర్చే మార్గం చెప్పింది. అతనిని దేవుని కొరకు సిద్ధపరిచింది. అతని మూలముగా సిరియా దేశం అంత దేవుని రక్షణను చూడగలిగింది. 

 

పైన ఉన్న రెండు సంఘటనల ద్వారా దేవుని కొరకు ఆత్మలు సంపాదించడంలో వయస్సు ఒక ఆటంకం కాదు అనేది గ్రహించాలి. అవును చిన్న వారు, పెద్ద వారు యవ్వనులు, వృద్ధులు అందరూ ఆత్మలను సంపాదించ గలరు. జ్ఞానం లేకపోవడం, ఆర్థిక క్షీణత ఆరోగ్యం లేకపోవడం సొంత సమస్యలు అనేవి వీటిలో ఏదియు ఆత్మల సంపాదనలో ఆటంకంగా ఉండవు. కాని ఒకటి మాత్రం ఆటంకంగా ఉంటుంది అదే సాక్ష్యం లేని జీవితం. బానిస అయిన చిన్న దాని మాటను సైన్యాధిపతి అయిన నయమాను విన్నాడు ఆ స్థాయికి ఆమె యొక్క సాక్ష్య జీవితం ఉన్నది. మరి ఈ నాడు మీ గురించి ఏమిటి? యేసుని వలె సరైన సాక్ష్య జీవితం ఉంటే మీరు కూడా ఆత్మల సంపాదన చెయ్యవచ్చు.

- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్

 

ప్రార్థన అంశం:-

2వ వారం, 4వ వారాలలో సువార్తను ప్రకటించాలి అని ఏర్పరుచుకున్న సేవ పరిచర్య జరిగేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet