Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.10.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 24-Oct-2021

దిన ధ్యానము(Telugu) 24.10.2021 (Kids Special)

 

గ్రామ మిషనరీ సంస్థ తరుపున ప్రత్యేకంగా చిన్న

పిల్లలకు.

 

"మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు" - 1యోహాను 1: 8

 

హాయ్ పిల్లలు మీరు ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారు అని యేసయ్య నామంలో నేను నమ్ముతున్నాను. 9వ, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ వరకు స్కూల్స్ మరియు కాలేజీలు ప్రారంభించేసారు. మీకు ఇంకా ప్రారంభించలేదు అని బాధగా ఉందా? మిమ్మల్ని యేసయ్య చాలా ఎక్కువగా ప్రేమించడం వలన భద్రముగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరు కూడా ప్రార్థన చెయ్యండి కరోనా వ్యాధి పూర్తిగా తగ్గి అంత నార్మల్ స్టేజి కి రావాలి. ఈ రెండు సంవత్సరాలలో ఏవేవి దొరకాలేదో అవి అన్నియు యేసయ్య మీకు ఇవ్వబోతున్నారు. నిశ్చయముగా యేసయ్య మీ ప్రార్ధనకు జవాబు ఇస్తారు. సరే కథ విందమా? 

 

ఒక ఇంట్లో అమ్మ, నాన్న, విక్కీ అనే తమ్ముడు ఉండేవారు. ఆ ఇంటికి ఒక సేవకుడు ప్రార్థన చెయ్యడానికి తరుచుగా వచ్చేవారు. ఎప్పటి వలె విక్కీ ఇంటికి ప్రార్థన చెయ్యడానికి వచ్చిన ఆయన దేనినో వెతుకుతూనె ఉన్నారు. అయ్యో పక్కింట్లో ప్రార్థన చేసి బ్యాగ్ ను, గొడుగును వదిలేసి వచ్చేసాను సరే విక్కీ నాలుగు ఇల్లు తరువత ఉన్న జబా అంటి ఇంట్లో ఉంటాయి తీసుకొని రా నాన్న అని అన్నారు. వెంటనే విక్కీ సరే పాస్టర్ గారు ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని వేగంగా పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆ ఇంట్లో బ్యాగ్, గొడుగును తీసుకున్నాడు విక్కీ. గొడుగు భుజంపై పెట్టుకొని గొడుగు యొక్క హ్యాండిల్ కి బ్యాగ్ తగిలించి మెల్లగా నడుస్తూ వచ్చాడు. కొద్దీ సేపటికి గొడుగు యొక్క హ్యాండిల్ విరిగి బ్యాగ్ క్రింద పడి మురికిగా అయిపోయింది. వెనకనుండి వచ్చి అమ్మ,నాన్న కు చెప్పాడు విక్కీ. సరే విక్కీ నువ్వు ఏడ్వావద్దు నేను వెళ్ళి పాస్టర్ గారితో మాట్లాడతాను నువ్వు బయపడవద్దు అని నాన్న చెప్పారు. సారీ పాస్టర్ గారు విక్కీ తప్పు చేసాడు అని నాన్న జరిగిన దానిని పాస్టర్ గారితో చెప్పారు. అందుకు పాస్టర్ గారు ఏం పరవాలేదు విక్కీ రా అని చెప్పి పక్కన కూర్చుండబెట్టుకున్నారు. విక్కీకి యేసయ్య యొక్క క్షమాపణ గూర్చి చెప్పడం ప్రారంభించారు. నువ్వు చేసిన తప్పు నీ తల్లిదండ్రులకు చెప్పావు కదా మీ నాన్నగారు నా దగ్గర విధేయతతో మాట్లాడారు కదా ఇదే విధంగా మన కొరకు యేసయ్య తండ్రి యొద్ద చాలా విధేయతతో మాట్లాడుతూనే ఉన్నారు. మనం తెలిసి తెలియక చేసిన తప్పులను మనం యేసయ్య కు చెప్పాలి అప్పుడు యేసయ్య మనలను క్షమించి మంచి పిల్లల వలె బ్రతుకుటకు యేసయ్య మనకు సహాయం చేస్తారు. మనం పరలోకం వెళ్ళడానికి యేసయ్య మాత్రమే మార్గం విక్కీ అని పాస్టర్ గారు చెప్పిన వెంటనే విక్కీ సంతోషంగా తన తలను ఆడిచండం ప్రారంభించాడు. ఆ తరువాత అందరూ కుటుంబంగా కలిసి ఇంకా ఎక్కువుగా ప్రార్ధించారు. మా పాపములను క్షమించి మమ్ములను పరలోకానికి చేర్పించండి యేసయ్య, సత్యమును వెంబడించే వారిగా మాకు సహాయం చెయ్యండి యేసయ్య అని ప్రార్ధించి వారిని సమర్పించుకున్నారు.

 

పిల్లలారా ఈ విక్కీ వలె చేసిన తప్పును దాచక నిజాయితీగా విడిచి పెట్టాలి మనం యేసయ్య ను క్షమాపణ అడిగితే మనసారా క్షమిస్తారు. కాబట్టి చేసిన తప్పులకు యేసయ్య యొద్ద క్షమాపణ అడిగి ఆయన యొద్దకు రావాలి. సరేనా 

- సిస్టర్. దెబోర

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet