Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.10.2021
Share:

By Village Missionary Movement

Sunday, 24-Oct-2021

దిన ధ్యానము(Telugu) 25.10.2021

 

అంశం: అభివృద్ది చేసుకుందాం, సృష్టించు కుందాం.

 

“యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును” - సామెతలు 2:6

 

కవిన్ అనే చిన్న వాడు పుట్టినప్పటినుండి కుంటివాడి వలె ఉండేవాడు. చదువులో కొంచం ఆశ్రద్దగా ఉండేవాడు. తన తండ్రికి ఇది చాలా బాధకరంగా ఉండేది. అందువలన తన కుమారుడు చేసే పనులను చూసినప్పుడు నీకు తెలివిలేదు, బుద్దిలేదు అని తరుచుగా తిట్టేవాడు. ఒక రోజు అదేవిధంగా తిడుతున్నప్పుడు కవిన్ తెలివి, బుద్ధి అంటే ఏంటి నాన్న ఆ రెండింటికి తేడా ఏమిటి అని అడిగాడు. వెంటనే తండ్రి ఒకరు నేర్పించే తెలివి తన అనుభవం నుండి చెప్పిన బుద్ధి ఒక మనుష్యుని సృష్టిస్తుంది అని చెప్పారు. వెంటనే కవిన్ ఆలోచించకుండా అయితే నాన్న మీకే తెలివి బుద్ధి లేదు, ఉండి ఉంటే నేను అభివృద్ధి చెంది వుండే వాడిని అన్నాడు. 

 

యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో సంచరించే కాలంలో వ్యాధులతో, బలహీనముతో కృంగిపోయి ఉన్న అనేకులకు ఆరోగ్యం ఇచ్చి వారిని బాగు చేసే, అభివృద్ధి చేసే మాటలను బోధించారు. ఇంక తన శిష్యులను చదువు లేని జాలరులను మరియు పాపి అయిన సుంకపు గుత్తాదారులను ఎన్నుకొని తన యొద్ద చేర్చుకొని బోధించి ఆయన పరలోకమునకు వెళ్లిన తరువాత పరిశుద్ద ఆత్మను అనుగ్రహించి వారిని అపోస్తలులుగా అనేకులు ఆశ్చర్య పడే వారిగా మార్చారు. పేతురు యేసుక్రీస్తు యొక్క ప్రేమ గల బోధనను విని కూడా యేసుని పట్టుకున్న ఒకడి యొక్క కుడి చెవిని నరికేసాడు. మూడు సార్లు యేసు ఎవరో తెలియదు అని నిరాకరించాడు. కోపంతో బుద్ధి లేనివాడిగా ప్రవర్తించాడు. అయినా కూడా తన తప్పును గ్రహించి మరల దేవుని యొద్ద సమర్పించుకున్నప్పుడు దేవుడు అతనికి ఓర్పును, సహనాన్ని ఇచ్చి అతని మూలముగా వేల కొలది ప్రజలు దేవున్ని అంగీకరించేలా చేశారు. పేతురు ద్వారా అపోస్తులలో మొదటి సంఘం కట్టబడింది అని చెప్పవచ్చు. అపోస్తులలను అధికారిగా నడిపించే వాడిలా ఉన్నాడు పేతురు. 

 

ప్రియమైన వారలారా! మీరు కూడా నాకు తెలివి లేదు బుద్ధి లేదు అని అనుకుంటున్నారా? పేతురు వలె మిమ్మల్ని కూడా అనేకులను నడిపించే వారిగా, మిగతా వారికి ఆలోచన చెప్పే వాడిగా, మీ యొక్క నీడను అనేక మంది వెంబడించే వారిగా మిమ్మల్ని చేయగలరు మన యేసయ్య. ఆయన యొద్ద పేతురు వలె మీ యొక్క ప్రతి కార్యములను చెయ్యడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞానం అడిగి మిమ్మును సమర్పించు కొంటె చాలు. దేవుని యొద్ద జ్ఞానం, తెలివి అనే ధనం ఉంది. వాటన్నింటి ద్వారా మిమ్మును అభివృద్ధి చేసు కొని అనేకులను అభివృద్ధి చేసే వారిగా మార్చుతారు అనే దానిలో సందేహమే లేదు. 

- సహోదరి. విశాలీ.

 

ప్రార్థన అంశం:-

రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజ్ విద్యార్థులు నివాసం ఉండుటకు భవన నిర్మాణ పనులు కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet