By Village Missionary Movement
Monday, 25-Oct-2021దిన ధ్యానము(Telugu) 26.10.2021
అంశం: ప్రార్ధించే బాలుడు.
"బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" - సామెతలు 22:6
హన్నా అనే స్త్రీ తనకు ఒక కుమారుడు కావాలి అని ప్రార్ధించిన ప్రార్ధనకు జవాబే ఈ సమూయేలు. గర్భంలో ఉన్నది మొదలుకొని ప్రార్థన అతనిని చుట్టి ఉండేది. అతను పుట్టినప్పటి నుండి ప్రార్ధనలోనే పెంచబడ్డాడు. పాలువిడిచిన తరువాత యెహోవా సేవకోరకు మందిరములో యాజకుడైన ఏలి యొక్క బాధ్యతలో విడిచిపెట్ట బడ్డాడు. ప్రారంభంనుండే యెహోవా మాటలను వినగలిగే స్థలములోనే సమూయేలు ఉండేవాడు. మొదట దేవుని స్వరాన్ని తెలుసుకో లేకపోయాడు అనేది నిజమే కాని ఎరిగిన తరువాత నీ దాసుడు అలకించు చున్నాడు ఆజ్ఞ ఇమ్ము అని చెప్పినది మొదలుకొని యవ్వన కాలంలోనే దేవునికి లోబడి ప్రార్ధించే అలవాటు గల వానిగా ఉన్నాడు అన్నది స్పష్టము అవుతుంది. సమూయేలు చిన్న వాడిగా ఉన్నప్పుడే దేవునికి సేవించడం, ఆయనకు లోబడటం నేర్చుకొనడం వలన పెరుగుతూ వస్తున్నప్పుడు అది అతనిని ఒక ప్రార్థన వీరునిగా మార్చింది. ప్రార్ధించే గుణం ఉన్న తల్లికి పుట్టే పిల్లలు యవ్వన వయస్సులోనే యెహోవాకు లోబడటం మరియు ఆయనను సేవించడం నేర్చుకుంటారు అనేది నిజం. సంఘ ద్వారం యొద్ద నిలబడే ప్రార్థన వీరులు అవసరం అయితే అందుకొరకు విన్నపం చేసే తల్లులు మరియు వేడుకొనే కుటుంబములు అవసరం. ప్రార్ధించే అలవాటు ఉన్న పిల్లలు అనేకులు సమూయేలు వలె ప్రార్ధించే తల్లికి పుట్టే పిల్లలు వలె ఉంటారు. ప్రార్ధించే అధికారులు అభివృద్ధి చెందటం అనేది ప్రార్ధించే ఇళ్లలోనే కదా ఉంది.
ప్రియమైన వారలారా దేవునికి స్థలం ఇయ్యని ఒక ప్రపంచిక తల్లి ద్వారా లోకాన్ని సేవించే ఒక కుటుంబంలో సమూయేలు పెరిగి ఉంటే అతను ఎలా ఉండి ఉంటారు? హన్నా సమూయేలు కొరకు తన యొక్క యవ్వన కాలంలో చేసిన ప్రయత్నం అతను ప్రార్థన వీరునిగా మారడానికి కారణం అయ్యింది. మీ పిల్లలు కూడా యవ్వన వయస్సు లోనే దేవునికి లోబడాలి అని మీరు ఆశ పడినట్లు అయితే వారి కొరకు హన్నా వలె ప్రార్ధించండి. కుటుంబమే పిల్లల విజయ వంతమైన జీవితమునకు మొదటి మెట్టుగా ఉండగలదు. కుటుంబ ప్రార్థన లేని ఇల్లు పై కప్పు లేని ఇల్లే. ఇంక పిల్లలను తప్పకుండా దేవుని అలయమునకు సండే స్కూలుకు పంపించండి. మీ ఇంటిలో కూడా ఉజ్జివ కుమారుడు అయిన సమూయేలు ఉంటాడు అనే దానిలో సందేహమే లేదు.
- బ్రదర్.E.M.పౌండ్స్
ప్రార్థన అంశం:
సువార్త సేవకు అవసరమైన కరపత్రికలు, నూతన నిబంధనలు మరియు పరిశుద్ద గ్రంధం దొరికేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250