By Village Missionary Movement
Wednesday, 03-Nov-2021దిన ధ్యానము(Telugu) 03.10.2021
అంశం: పోస్ట్ చెయ్యండి.
"ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు" - కీర్తనలు 65:2
శ్రద్ధ గల ప్రార్థన అనేది పోస్ట్ బాక్స్ లో ఉత్తరం వేసి తరువాత దానిని గూర్చి అజాగ్రత్త వంటిది. కాని ఉత్తరం చేతిలో పట్టుకొని దీనికి జవాబు రాకపోతే ఏమి చెయ్యాలి అని సందేహపడితే దేనినైనా పొందుకొన గలమా? పోస్ట్ బాక్స్ ను మరియు పోస్ట్ మ్యాన్ ను విశ్వసిస్తే తప్ప వారు ఏమి సాదించలేరు.
పరిశుద్ద గ్రంధంలో మన వలె శ్రమ పడిన వ్యక్తి ఏలీయా. దేవుని దృష్టికి చెడుతనము చేస్తూ వస్తున్న అహాబు రాజు యొద్ద ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగా ఈ సంవత్సరంలో వర్షమైనను, మంచు అయినను పడదని ప్రకటించాడు. అదే విధముగానే జరిగింది. ఆ దినముల తరువాత ఏలీయా మరియు అహాబు రాజు కర్మెలు పర్వతం పైన ఉన్నారు. ఏలీయా అహాబు రాజు యొద్ద విస్తారమైన వర్షం వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది అని అన్నాడు. ఏలీయా పర్వతము మీదకు పోయి తన ముఖమును మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్ధించాడు. తరువాత తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుము అని చెప్పాడు. ఆ దాసుడు తిరిగి వచ్చి అతి చురుకుగా ఏమియు కనబడలేదు అన్నాడు. ఇంకా ఏడుమార్లు పోయి చూడుము అని చెప్పాడు ఏలీయా. ఏడవ మారు ఆ దాసుడు అదిగో మనిషి చెయ్యి అంత మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నది అని చెప్పాడు. ఒక వ్యక్తి శ్రద్ధగా ప్రార్థన చేసాడు కొద్ది సేపట్లోనే వాన కురిసింది.
ప్రభువునందు ప్రియమైన వారలారా! మన యొక్క జీవితంలో సమస్యలు గల సమయాల్లో తికమక పరిస్థితులలో మన జీవితాన్ని ప్రభునకు అప్పగించి ఆయన పై నమ్మకము ఉంచి ప్రార్ధించినప్పుడు ఆయన కార్యాన్ని జరిగిస్తారు. ఒక ఉత్తరాన్ని నమ్మకంతో పోస్ట్ బాక్స్ లో వేసినప్పుడు మాత్రమే అది తగిన వ్యక్తికి చేరి జవాబును పొందుకొనగలము అనే దాని వలె మనం ప్రార్ధించినప్పుడు మాత్రమే దేవుడు మన కొరకు కార్యములు చేస్తారు. మనము కూడా విజయాన్ని పొందుకుంటాం. పరిస్థితులను చూసి కృంగిపోవద్దు జీవము గల దేవుడు తప్పకుండా మన ప్రార్ధనకు జవాబును పంపిస్తారు. ఆమెన్.
- సిస్టర్. టి. బ్యూల
ప్రార్థన అంశం:-
సంఘములు తెరిచి ఆరాధన చేయుటకు సహాయము చేసిన దేవునికి స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250