Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.10.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 07-Nov-2021

దిన ధ్యానము(Telugu) 07.10.2021 (Kids Special)

 

గ్రామ మిషనరీ సంస్థ తరుపున ప్రత్యేకంగా చిన్న

 పిల్లలకు.

 

"ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే" - 1కోరింథీయులకు 12: 22

 

ప్రియమైన చిన్నపిల్లలారా మీకు బైబిల్ స్టోరీస్, ఆనిమాల్ స్టోరీస్ వింటారు కదా? మీ చేతిలో ఉండే వేళ్ళు మాట్లాడుకునే కథను ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా? వినలేదు కదా. అయితే ఈ రోజు చేతి వేళ్ళు ఏం మాట్లాడు కొంటున్నాయో ఈరోజు కధ విందమా? 

 

ఒక చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి? ఐదు వేళ్ళు వెరీ గుడ్. ఒక్కొక్క వేలుకు ఒక పేరు ఉంటుంది తెలుసా? తెలియదా ఒకే నేను చెబుతాను వినండి. బొటన వ్రేలు ఈ వ్రేలు నన్ను చూడండి పొట్టిగా ఉన్నా సరే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో నేను లేకుండా ఒక గ్లాసును కూడా మీరు పట్టుకొని ఎత్తలేరు అని చెప్పిందట దానికి మిగతా వ్రేళ్లు అన్నీ ఒప్పుకున్నాయి అంట. తరువాత చూపుడు వ్రేలు నేనే అందరికి దారి చూపిస్తాను మరియు ఇక్కడే, అక్కడే అని గుర్తు చూపిస్తాను కాబట్టి నేను ఎంతో ప్రాముఖ్యం అని చెప్పిందట. దాని ప్రక్కనే ఉన్న పొడుగు వ్రేలు నేను ఏం చెప్పాలి అని తన పరిమాణం బట్టి వ్రేళ్ళు అన్నింటి కంటే పెద్దదాన్ని కాబట్టి నేనే పెద్దదాన్ని అని చెప్పిందట. నాలుగవ వ్రేలు కు టక్కున జ్ఞాపకం వచ్చింది ఏమిటో తెలుసా పెళ్లి అయినప్పుడు నాకే ఉంగరం పెడతారు. బంగారం, వెండి, వజ్రాలు అన్నింటిని నాకే పెడతారు అని గర్వంగా చెప్పిందంట. చివరిలో ఉన్న చిటికిన వ్రేలుకు ఏం చెప్పాలో తెలియలేదు కాబట్టి యేసయ్య నేను చెప్పడానికి ఏమియు లేదు అని బాధ పడిందంట. అందరూ వారి యొక్క గొప్ప తనాన్ని చెప్పారు అని ఆలోచించి నప్పుడు యేసయ్య తనతో మాట్లాడారు ఏమనో తెలుసా చేతులెత్తి దండం పెట్టి ప్రార్ధించినప్పుడు నువ్వేకదా అందరి కంటే ముందు ఉంటావు అని యేసయ్య మాట్లాడినప్పుడు ఆ చిటికిన వ్రేలు చాలా సంతోష పడింది. అవును మీరు చెప్పింది నిజమే లోకపనులు చేయుటకు మీరందరు ఉపయోగ పడుతున్నారు ప్రార్ధించి నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రక్కనే నేనే ఉంటాను ప్రార్థిస్తే కదా అన్ని కార్యములు జరుగుతాయి. అని ఆ చిటికిన వ్రేలు చెప్పిందంట. అవును చిటికిన వ్రేలు చెప్పింది నిజమే కదా అని మిగిలిన వ్రేళ్లు అన్ని అంగీకరించాయి అంట. 

 

పిల్లలారా వ్రేళ్లు అన్ని మాట్లాడినది విన్నారు కదా! చిటికిన వ్రేలు వలె నాకు చెప్పుకొనుటకు గొప్పగా ఏమియు లేదు, వసతి లేదు చదువు లేదు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు అని అనుకుంటున్నారా? కాని మీరు పగిలిన మనస్సుతో ప్రార్ధించి నప్పుడు యేసయ్య మీ ప్రక్కకు వస్తారు దేనికి పనికి రాని వాళ్ళు అని అనేకులు మిమ్మల్ని అనవచ్చు. కాని యేసయ్య ప్రక్కనే మీరు ఉన్నప్పుడు లిటిల్ స్టార్ గా మిమ్మల్ని మార్చుతారు. ఏంటి పిల్లలు సంతోషమే కదా? 

- సిస్టర్. దెబోరాల్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet