Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.10.2021
Share:

By Village Missionary Movement

Monday, 08-Nov-2021

దిన ధ్యానము(Telugu) 08.10.2021

 

అంశం:- నమ్మకమైన మనుష్యుడు.

 

"నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు" - సామెతలు 28: 20

 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా మనం క్రీస్తుకు మరియు మన కుటుంబమునకు నమ్మకమైన వారిగా ఉండుటకు ఏర్పరచబడ్డాము. ఉదాహరణకు అబ్రాహాము దేవుని యందు నమ్మకంగా ఉండి ఆశీర్వాదములు అన్ని పొందుకున్నాడు. అదే విధంగా మోషే గురించి దేవుడు సంఖ్యకాండంలో 12:7 లో సాక్ష్యం ఇస్తున్నారు. ఈనాడు మోషే ఏయే కార్యములలో నమ్మకంగా ఉన్నడో చూద్దామా? 

 

1. కుటుంబంలో నమ్మకం గల వానిగా ఉన్నాడు. నిర్గమకాండం 4:18లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి, నడిపించుకొని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మోషే తన ఇంటికి వెళ్ళి తన మామయ్య యొద్ద నిజం చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. తన భార్య పిల్లలు యొద్ద నమ్మకంగా ఉన్నాడు. ఈరోజుల్లో ఎన్నో కుటుంబాల్లో నమ్మకం, నిజాయితీ లేకుండా ఉంది. భార్య భర్తల మధ్య నమ్మకం లేదు, పిల్లల దగ్గర నమ్మకము లేదు. మన జీవితంలో మనం పరిపూర్ణ ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మొదటిగా కుటుంబంలో నమ్మకంగా ఉందాం. 

 

2. పనిలో నమ్మకంగా ఉండే వాడు. మోషేకు దేవుడు తనకు ఇచ్చిన పిలుపులో చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు జీవ గ్రంధంలో ఉన్న తన యెక్క పేరును కూడా తీసివేయమని చెప్పాడు. అవును దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనను నమ్మకంగా చేద్దాం. ఒకవేళ మనకు నచ్చని, ఊహించని పని కూడా అయి ఉండవచ్చు. కాని ఆ పని మనకు అప్పగించిన వారు దేవుడే. అందువలన ఆ పనిలో మనం నమ్మకంగా ఉందాం.

 

ప్రియమైన వారలారా! నమ్మకమైన వాడు అని నమ్మి ఉన్నతమైన సేవను ప్రభువైన యేసుక్రీస్తు మోషేకు ఇచ్చారు. దానిని మోషే కూడా అలాగే కాపాడుకొన్నాడు. మన యొక్క జీవితం ఎలా ఉంది? లోకంలో మనకు ఇవ్వబడిన చిన్న చిన్న పనులలో మనం నమ్మకంగా ఉన్నామా అనే దానిని అలోచించి చూద్దాం. కొంచంలో నమ్మకంగా ఉన్న వానికి చాలా మంది పైన అధికారిగా ఉండుటకు బాధ్యత ఇవ్వబడుతుంది. దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు మనం కూడా మన జీవిత కాలం అంత విశ్వాసముగా, నమ్మకంగా ఉందాం. 

- శ్రీమతి. డి. దివ్య అలెక్స్

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణం దినధ్యాన పత్రికను అచ్చువేయుటకు అవసరమైన వస్తువులకొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet