By Village Missionary Movement
Tuesday, 09-Nov-2021దిన ధ్యానము(Telugu) 09.10.2021
అంశం:- ఉప్పు
"మీరు లోకమునకు ఉప్పయి యున్నారు" - మత్తయి 5:13
ఆరోజు రాజు యొక్క పుట్టినరోజు. కాబట్టి రాజభవనము అంతా అలంకరించబడింది. చాలా మందికి బహుమతులు అందించబడ్డాయి. చాలా మంది కౌలు రాజును అభినందిస్తూ బహుమతులను అందుకొని వెళ్లారు. ఆ సమయంలో భోజనం చెయ్యడానికి వచ్చిన రాజు తన కొరకు వండి వడ్డిస్తున్న దాసుల యొద్ద మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అని అడిగారు. వెంటనే ఒకతను మీరు బంగారం వంటి వారు అన్నారు. మరొకతను మీరు వజ్రం వంటి వారు అని అన్నాడు. మరి ఇంకొక ఆయన మీరు ముత్యం వంటి వారు అన్నారు. ఒక వయస్సు అయిన దాసుడు మాత్రం మీరు ఉప్పు వంటి వారు అన్నాడు. రాజు ఏమంటున్నారు అని అడిగినప్పుడు మీరు అందరికి ఉపయోగకరమైన రుచిగల పరిశుభ్రమైన వారు అని అన్నాడు. అందుకు రాజు సంతోషించి అతనికి బహుమతి ఇచ్చారు. యేసుక్రీస్తు కూడా భూమి మీద సంచరించిన సమయంలో తనను వెంబడించే జనులను చూసి మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అందుకు ఒక యవ్వనుడు నిత్య జీవం పొందుటకు నేను ఏం చెయ్యాలి అని యేసుక్రీస్తు యొద్ద అడిగినప్పుడు ఆజ్ఞాలను గైకొనుమని చెప్పి నీకు కలిగి యున్నవన్నీ అమ్మి బీదలకు ఇమ్మన్నారు. అతడు మిగుల ఆస్తి గల వాడు గనుక అతని యొక్క ఆస్తిని లేని వారికి పంచుకొంటూ ఉపయోగ కరమైన జీవితం గడపాలి అని అలా అన్నారు. ఉప్పు కూడా తనతో కలిసిన వస్తువులతో పంచుకొంటేనే అది రుచికరంగా ఉంటుంది. అందువలన ఉప్పు లేని వస్తువు కుప్పలోనే అనే కవితను చెబుతారు. ఇతరులు మిమ్మును భయం లేకుండా ఆందోళన లేకుండా సంప్రదించు విధముగా మనం సమాధానం గల వారిగా మిగతా వారికి మన యొద్ద ఉన్నది పంచి ఇచ్చే వారిగా ఉండాలి.
అవును ప్రియమైన వారలారా! మీరుకుడా నిత్యజీవం పొందుకోవాలా? అయితే ఉప్పు వలె మారండి ప్రతి ఒక్కరు మనలను సంపాదించే వారిలా మరియు ప్రతి ఒక్కరికి మనం ఉపయోగకరమైన వారిగా మారుదాం. ఇతరుల జీవితమును రుచికరంగా మారుద్దాం. మనలో ఉన్న ప్రేమను, సంతోషాన్ని, వస్తువులను మనతో పాటు ఉన్నవారితో పంచి పెట్టి ఉపయోగకరమైన జీవితమును జీవిద్దాం. గాడ్ బ్లెస్ యు.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్
ప్రార్థన అంశం:-
మనతో కలిసి సేవచేస్తున్న తోటి సేవకుల కుటుంబాలు ఆశీర్వదించబడేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250