Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.10.2021
Share:

By Village Missionary Movement

Thursday, 18-Nov-2021

దిన ధ్యానము(Telugu) 18.10.2021

 

అంశం:- చెవిటి వారి విజయం.

 

"బలము తెచ్చుకొని వెళ్లుము" - న్యాయదిపతులు 6:14

 

అది వర్షాకాలం ఎక్కడ చూసినా నీరు గుంతలు గుంతలుగా ఉన్నాయి. ఒక లోతైన గుంటలో చాలా కప్పలు ఉన్నాయి. ఆ కప్పలు తమలో తాము పోటీ పెట్టుకున్నాయి. ఈ గుంతలో నుండి ఎవరు మొదట పైకి ఎక్కుతారు అనేదే ఆ పోటీ. పోటీ ప్రారంభం అయ్యింది. కప్పలు పైకి ఎక్కడం మొదలు పెట్టాయి. కాని కొంచం పైకి ఎక్కిన వెంటనే టక్కున క్రిందకు జారి పడిపోయేవి. మళ్ళీ ప్రయత్నించిన అదేవిధంగా జారి పడిపోయేవి. ఆ గుంత చుట్టూ ఉండి చూస్తున్న మిగతా కప్పలు మీరు దీనిని ఎక్కి పైకి రాలేరు అని హేళనగా మాట్లాడాయి. ఆ మాటలు ప్రయత్నిస్తున్న కప్పలకు ఆటంకంగా అనిపించి ప్రయత్నం చెయ్యడం మానేశాయి. కాని ఒకే ఒక కప్ప మాత్రం చాలా నిదానంగా పైకి వచ్చి పోటీలో గెలిచింది. ఈ కప్ప మాత్రం ఎలా విజయం పొందుకున్నది అని ఆ కప్పకు అడిగినప్పుడు ఆ కప్ప నాకు చెవులు వినబడవు అని చెప్పింది. అవును ఇతరుల హేళన చేసే మాటలు గమనించి నప్పుడు అలసిపోయిన కప్పలు ఓడిపోయాయి. గెలిచిన వారికి మరియు ఓడిన వారికి కూడా చరిత్రలో స్థానం ఉంటుంది. కాని విమర్శించే వారికి ఏమియు ఉండదు. అవును గెలుస్తున్నామా? లేక ఒడిపోతున్నమా? అనేది ప్రాముఖ్యం కాదు. ప్రయత్నం చేస్తున్నమా లేదా అనేదే ముఖ్యం. ఈనాటికి మనం ప్రయత్నం చేసే ముందు అనేకులు మాటలు విని ఈ పనిని నేను చేయ్యలేను అనుకొని ప్రయత్నం చెయ్యడం విడిచి పెడుతున్నాం. 

 

పరిశుద్ద గ్రంధంలో సమూయేలు ద్వారా అభిషేకించబడి పరిపాలించుటకు దేవుని చేత ఏర్పరచబడిన వాడు సౌలు. సమస్త జనులు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడు అని హేళన చేసారు మరియు నిర్లక్ష్యం చేశారు. కాని సౌలు చెవిటి వాడైనట్టు ఊరకుండెను అని 1 సమూయేలు 10:27 లో వ్రాయబడింది. దీనిని చదువుతున్న ప్రియులరా మీరు ఎలా వుంటున్నారు? మనం ఏదైనా ఒకటి చెయ్యడం ప్రారంభించిన వెంటనే మనలను హేళన చెయ్యుటకు, హేళన చెయ్యుటకు పై స్థాయిలోనికి అనేక మంది వస్తారు. పొగడ్త అనేది ఎవరి నుండి రాదు. పరిచర్య అయి ఉండవచ్చు లేదా పని చేసే స్థలము అయి ఉండవచ్చు చివరికి కుటుంబంలో కూడా ఇలా ఉండవచ్చు. నువ్వు అంత పూర్తి చెయ్యలేవు వేరే పనిని చూసుకో అని చెప్పవచ్చు. అతడు చెవిటి వాడై యుండెను అనే ఈ మాట మీ కొరకే. నేనే భయపడుతూ దీనిని ప్రారంభిస్తున్నాను మీరు ఇంకా దేనినో చెప్పి నన్ను ముందుకు సాగకుండా చేస్తున్నారు అనే ఆందోళన చెందే ప్రియ సహోదరి సహోదరులారా! బయపడవద్దు. దేవుడు మీ పక్షమున ఉన్నాడు. ఎవరు ఏం చెప్పినా సరే చెవిని బెట్టకుండా పూర్తి విశ్వాసంతో పని చెయ్యండి అప్పుడు విజయం మాత్రం కచ్చితం. నిన్ను పంపిన వాడు నేనే కదా అని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉండి మనలను నడిపించి మనకు విజయం ఇస్తారు. అనేకులకు ఆశీర్వాదకరంగా మనలను హెచ్చిస్తారు. హల్లెలయా!.

- శ్రీమతి. ధవమని వైరవేల్ గారు

 

ప్రార్థన అంశం:

హోమ్ పిల్లలు నివాసం ఉండే స్థలములో అవసరమైన చాపలు, దుప్పట్లు కొనేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort