By Village Missionary Movement
Friday, 19-Nov-2021దిన ధ్యానము(Telugu) 19.10.2021
అంశం:- సిసి టి.వి కెమెరా.
"చూచుచున్న దేవుడవు నీవే" - ఆదికాండము 16:13
నేరాలు పెరుగుతున్న ఈనాటి పరిస్థితుల్లో సిసి టి.వి కెమెరా చాలా ప్రముఖ్యమైనదిగా మారింది. ప్రజలు ఎక్కువగా కూడి ఉండే విమానం, ట్రైన్ మరియు బస్ స్టేషన్లో, హాస్పిటల్స్ లో, షాపింగ్ మాల్స్ లో , రోడ్లు, వీధులు మరియు ఇళ్ళలో కూడా సిసి టీవీ లు అమర్చబడి పర్యవేక్షణలో ఉంచబడుతున్నవి. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనందరిని పరీక్షిస్తున్న దేవునిలా ఉన్నారు.
ఒకసారి ప్రజలు అందరూ కానుకల పెట్టెలో కానుకలు వేయుటను యేసుక్రీస్తు గమనిస్తూ ఉన్నారు. ధనవంతుల కంటే ఒక పేద విధవరాలైన స్త్రీ వేసిన కానుకను చూసి ఆమె యొక్క శ్రద్ధ, నిజాయితీ, ఆశ అన్నింటినీ ఎరిగి ఆమె దేవుని కొరకు ఇచ్చిన కానుకను గూర్చి ఆమెను పొగిడారు. చాలా సంవత్సరాలకు ముందు జీవించిన అబ్రాహాము యొక్క ఇంకొక భార్య లేదా సారాయి యొక్క దాసి అయిన హగరు తన యజమానురాలైన సారాయి వలన హింసించబడినప్పుడు అరణ్యమునకు పారిపోయింది. గర్భవతి అయిన హాగరు యొక్క అంగలార్పును విని ఆమె కన్నీటిని చూచి ప్రభువు ఆమెతో మాట్లాడారు. తనతో. మాట్లాడిన యెహోవాకు చూచుచున్న దేవుడవు నీవే అని పేరుపెట్టి ఆయన స్వరాన్ని విని ఆయనకు లోబడి తన యజమానురాలు యొద్దకు మరల తిరిగి వెళ్ళింది.
నేను పి.యు.సి పూర్తి చేసుకొని టి.ఈ. ఎల్.సి ఆశ్రమంలో పనిచేస్తు ఉన్నప్పుడు 1978వ సంవత్సరం మనోరోగ చికిత్స కళాశాలలో చదువుకొనే అవకాశం దేవుడు ఇచ్చారు. మొదటి సంవత్సరంలో కళాశాల ప్రిన్సిపాల్ ఒకరోజు అసంబ్లీకి నన్ను ముందుకు పిలిచి నా కొరకు అందరిని చప్పట్లు కొట్టమని అడిగారు. మూడవ అంతస్తు నుండి వారు నేను కళాశాల చెత్తను, పేపర్స్ ను నేను చెత్త బుట్టలో వేయుట వారు గమనించారు. ఇంకా ఆశ్రమంలో ఉండి చదువుకొంటున్న నా యొక్క కొన్ని పనులను, కార్యములను గమనించి నన్ను పొగిడారు. ఆ రోజు రాత్రి నేను నా డైరీలో ఈ విధముగా రాసాను. నా దేవా నన్ను మీరు ప్రతి సెకను గమనిస్తూనే ఉన్నారు. నా పనులు మనుష్యులకు మాత్రమే కాదు మిమ్మును కూడా సంతోష పరిచేలా ఉండాలి. నాకు సహాయం చెయ్యండి అని ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కొన్ని సమయాల్లో నా వల్ల కానప్పుడు దేవుని యొద్ద నన్ను క్షమాపణ అడిగి నన్ను సరిచేసుకొనుటకు ప్రయాస పడుతువున్నాను.
అవును ప్రియమైన వారలారా! మనలను గమనించే కెమెరా దేవుని కన్నులే. మీకు ఇష్టమైనదే చేయుటకు నాకు నేర్పుము. మీరే నా దేవుడు మీ యొక్క శుద్ధ ఆత్మ నన్ను మంచి మార్గంలో నడిపించును గాక! ఆమెన్.
- శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు
ప్రార్థన అంశం:-
మహారాష్ట్ర మరియు మేకువంగలం ప్రాంతంలో సేవచేసే ఏక దర్శనం గల సేవకులు లేచేలా మరియు 7000 మంది మిషనరీల ద్వారా ఒక లక్ష గ్రామాలు సందింపబడాలి అనే ప్రణాళిక కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250