Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.10.2021
Share:

By Village Missionary Movement

Monday, 22-Nov-2021

దిన ధ్యానము(Telugu) 22.10.2021

 

అంశం:- హృదయంలో మొదటి స్థానం.

 

"కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును" - మత్తయి 6: 33

 

ఒక ఒంటరి వ్యక్తి దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు వేలకొలది మేలులలను పొందుకొనగలడు అనే దానికి క్లోరెన్ జి.ఎస్. మోహన్ వ్యక్తి ఉదాహరణ. ఈయన యవ్వన కాలంలో ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ను తన సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ప్రతి రోజు ప్రభువును వెతకడం ప్రారంభించారు. యేసుక్రీస్తు లేకుండా నేను ఏమియు చేయలేను అని నిర్ణయించుకొని ప్రభువు పిలుపును అంగీకరించి ఆయన మాటకు లోబడి ఉద్యోగమునకు రాజీనామా చేసి సంపూర్ణ మిషనరీగా సమర్పించుకున్నారు. ఈవిధంగా అతను తన జీవితంలో మొదటి స్థానం ఇవ్వడం వలన పొందుకున్న మేలులు అనేకం. తమిళ మెతడిస్ట్ చర్చిలో సేవచేస్తూ దేవుని కృపను పొందుకొన్నారు. తమిళనాడులో ఉన్న సేలం డేనిష్ బేతేల్ చాలా బాధ్యతలకు అధికారి స్థానంలో ఉండి దేవుని పనిని చేశారు. తరువాత ఒక మిషనరీ స్థాపనలో పాలుపంచుకొని ఆశీర్వాదములను పంచుకొన్నారు. తన పిల్లల జీవితంలో ఉన్నతమైన పై స్థాయిని చూడగలిగారు. దేవుడు అతనిని అధికముగా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్లారు. 

 

పరిశుద్ద గ్రంధంలో కూడా యూదా రాజైన అభియా రాజు పరిపాలనలో ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. మొదటిగా అతను చేసిన పని ఏమిటి అంటే అతను దేవున్ని వెతికారు మరియు యెహోవా మాకు తోడై యున్నారు అని దైర్యంగా చెప్పుటను మనం చూస్తున్నాం. ఆ దేశ ప్రజలు మరియు రాజు దేవుని పై ఆనుకొనుట వలన యుద్ధమును ధైర్యముగా చెయ్య గలిగారు అని మనం చూడగలిగాం. అభియా రాజు యొక్క కాలం లోనే యరొబాము సైనం అభియా యెదుటను, యూదా వారి యెదుటను నిలువ లేకుండనట్లు యెహోవా వారిని మొత్తి నందున వారు సంహరింపబడిరి.

 

ప్రియమైన దేవుని పిల్లలారా యేసును అంగీకరిస్తే చాలు అని కాదు గాని యేసయ్యకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు రాజుకు దొరికిన విజయం పైన చూసిన వ్యక్తికి దొరికిన మేలులు నిశ్చయముగా మన జీవితంలో కూడా దొరుకుతాయి అనే దానిలో సందేహమే లేదు. దేవుడే ఈ విధముగా జీవించుటకు మనలను ఆశీర్వదించును గాక! ఆమెన్.

- శ్రీమతి. జోన్స్ మేరీ రాబర్ట్ గారు.

 

ప్రార్థన అంశం:-

సేవ స్థలంలో సువార్త ప్రకటించుటకు వెళుతున్న వాహనములకు దేవుని సంరక్షణ ఉండులాగున మరియు ప్రమాదముల నుండి దేవుడు కాపుదల దయచేయు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet bahiscasino betsat betsat pashagaming pashagaming betpas betpas giriş ngsbahis perabet perabet giriş