By Village Missionary Movement
Friday, 26-Nov-2021దిన ధ్యానము(Telugu) 26.10.2021
అంశం:- సిద్ధమా?
"ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను" - 2రాజులు 13:14
ఒక సేవకుడు సంఘంలో నా పనికొరకు ఎవరు వెళ్తారు అనే అంశంతో పరిచర్య కొరకు పిలిస్తున్న ప్రభువు యొక్క స్వరం యొద్దకు ఎవరు వస్తున్నారు అనే ప్రశ్నతో తన యొక్క ప్రసంగం ముగించి ప్రార్థన చేశారు. తన కన్నులను తెరచి దేవుని సేవ కొరకు వచ్చేవారు చేతులు పైకి ఎత్తండి అన్నారు. ఇదిగో నేను వస్తున్నాను అని జన సమూహము లో నుండి ఒక స్వరం వినబడింది. అక్కడ ఒక యవ్వనస్తుడు కన్నీటితో లేచి నిలబడి దేవుని పని కొరకు నన్ను పంపించండి నేను వెళ్తాను అన్నాడు. దీనిలో బాధ పడవలసిన కార్యం ఏమిటి అంటే వందల కొలది ప్రజలు ఉన్న ఆ సభలో ఒకే ఒక యవ్వనస్తుడు తనను దేవుని సేవకు సమర్పించుకొన్నాడు. తరువాత అతనిని ఆదివాసి ప్రజల మధ్యలో సేవ చేయుటకు పంపించారు. అతని మూలముగా దేవుడు విస్తారమైన ఆత్మలను రక్షించి అనేక అద్భుత కార్యములను చేసి గొప్ప ఉజ్జీవమును కలుగ జేశారు. మన అమూల్యమైన నిధి అయిన పరిశుద్ద గ్రంధంలో ఏలీషా కూడా దేవుడు తనను పిలుస్తున్నారు అని ఏలీయా మూలముగా గ్రహించి ప్రభుని మాటకు లోబడి తన కుటుంబమంతటిని విడిచి పెట్టి ఏలీయా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేస్తూ ఒక చిన్న సేవనే చేసాడు. కాని దేవుడు అతని లోబడే గుణమును, విధేయతను మర్చిపోలేదు. ఒక రోజు వచ్చింది ఏలీయా యొక్క స్థానమును అతని యొక్క శక్తిని రెండతలుగా ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలను మంచి మార్గంలో విజయ వంతంగా నడిపించే రూతు వలె దేవుడు అతనిని ఉపయోగించు కొన్నారు.
ప్రియమైన వారలారా ఆ యవ్వనస్తుని విధేయత దేవుని అవసరమును పూర్తి చేసింది. అందువలన ఒక జన సమూహమే రక్షించబడింది. ఏలీషా యొక్క విధేయత ఆ దేశ ప్రజలను ఉత్తమమైన మార్గంలో నడిపించింది. మరి మీ గురించి ఏమిటి మీ యొద్ద దేవుడు తన ప్రణాళికను గూర్చి మాట్లాడుతూనే ఉన్నారు. మనం పరిశుద్ద గ్రంధం చదివినప్పుడు లేదా దేవుని సేవకుల భోధను విన్నప్పుడు దేవుడు మనకు తెలియ జేస్తూనే ఉన్నాడు. కాని మనం మాత్రం దేవుడు మన సొంత ఆవసరతలు నెరవేర్చితే చాలు అని అతని అవసరతను పట్టించు కోకుండా విడిచి పెడుతున్నాం. ఇది సరైనది కాదు మనం ఆయన యొద్ద అడిగిన కార్యములు ఈ లోకంలో నశించి పోతాయి. కాని ఆయన ఎదురు చూసే అవసరం నశించిపోయే ఆత్మలే. కావున ఆయన యొక్క ఆవసరతకు ప్రాధాన్యత ఇచ్చి దానిని పూర్తి చేద్దాం.
- బ్రదర్. జబాస్ కోయల్ రాజ్ గారు
ప్రార్థన. అంశం.
క్రిస్మస్ రోజుల్లో జరుగుతున్న సేవలలో దేవుని హస్తం తోడై ఉండులాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250