Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.10.2021
Share:

By Village Missionary Movement

Monday, 29-Nov-2021

దిన ధ్యానము(Telugu) 29.10.2021

 

అంశం:- హృదయ కాపుదల.

 

"నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము" - సామెతలు 4: 23

 

ఇద్దరు రైతులు స్నేహితులుగా ఉండేవారు. వారి దగ్గర బంజరు భూములు ఉండేవి. ఆ సంవత్సరం వర్షం బాగా పడడంతో ఇద్దరు కూడా తమ భూముల్లో ఏదైనా పండిస్తే మంచి దిగుబడి వస్తుంది అని మాట్లాడుకున్నారు. వారు టమాటా నారు నాటుదాం అనుకొని పని మొదలు పెట్టారు. నారును నాటారు మొక్కలు పెరిగాయి. మొదటి రైతు తన తోట చుట్టూ కంచె వేసాడు. తరువాత టమాటా మొక్కల మధ్యలో పెరిగే కలుపు మొక్కలను తీసివేసాడు. ప్రతి రోజు వాటికి నీటిని అందించే వాడు. రెండవ రైతు ఇతనికి పనిలేదు కంచె వేసి కలుపు మొక్కలను తియ్యలా నీటిని అందిస్తే సరిపోదా అని హేళనగా మాట్లాడే వాడు. ఫలించే సమయం వచ్చేసింది. రెండు తోటలలో కూడా కాయలు కసాయి. ప్రతి రోజు సాయంత్రం ఇద్దరు తోటను చూస్తూ గమనించి నప్పుడు రెండవ రైతు నేను కంచె కట్టలేదు కలుపును కూడా తియ్యలేదు. కాని నా తోట చాలా చక్కగా కాసింది. నువ్వు కంచె వేసి ని డబ్బును కలుపు తీసి ని సమయమును వృధా చేసి నువ్వు అనవసరమైన పనిని చేస్తున్నావు అని మొదటి రైతును హేళన చేసాడు. టమాటలు ఏరి రేపు ఉదయం బజారుకు వెళ్లి అమ్ముదాం అని మాట్లాడు కున్నారు. గోనెలను తీసుకొని వేకువ జామునే తోటలోనికి వచ్చారు. కంచె లేని తోటలో కాయలు అన్నీ ఏరి తోట అంత కాళీగా ఉంది. ఎవరో చాలా రోజులుగా తోటను గమనించి టమాటా కాయలను ఏరుటకు సరైన సమయం చూసి కంచె లేకపోవడంతో తోటలోని కాయలు అన్నీ ఏరివేశారు. దానిని చూసిన రెండవ రైతుకు చాలా బాధ అనిపించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.

 

 అవును కంచె లేని భూమి కాపుదల లేని దానివలె మన హృదయమును కూడా కాపాడుకొనక పోతే అది మన ఆత్మీయ జీవితమునకు చాలా నష్టం కలిగిస్తుంది. ముఖ్యముగా మీ హృదయమును చాలా భద్రముగా కాపాడుకొనుము అని బైబిల్ చెబుతుంది. అలా అయితే మన హృదయమును ఎలా కాపాడుకోవాలి. వాక్యం అనే కంచె తోనే మన హృదయాన్ని కాపాడు కోవాలి. మనం అజాగ్రత్తగా ఉన్న సమయంలో సాతాను కలుపును నాటి మన హృదయమును పాడుచేయుటకు సిద్ధంగా ఉంటాడు. శోధనల నుండి జయించుటకు చాటుగా తెలిసి తెలిసి చేసిన పాపము నుండి తప్పించుటకు పరిశుద్ద గ్రంధం అనే కంచె ప్రాముఖ్యమైనది. కాపాడు కొనే హృదయంలో జీవ దారలు బయలుదేరును. అది మనకు మాత్రమే కాక అనేక మందికి దీవెన కరముగా ఉండును. 

- బ్రదర్. డి. ఆల్విన్ జాకబ్ గారు

 

ప్రార్థన అంశం:-

క్రిస్మస్ సమయంలో జరిగే పరిచర్య మూలముగా అనేకులు రక్షింపబడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon jojobet palacebet sonbahis wbahis grandpashabet betgit betsalvador matbet meritking