Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.12.2021
Share:

By Village Missionary Movement

Thursday, 02-Dec-2021

దిన ధ్యానము(Telugu) 02.12.2021

 

అంశం:- పిలుపుని గూర్చి భయమా?

 

"తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి" - మత్తయి 2: 11

 

దంపతులైన యోసేపు, మరియ దంపతులకు ఒక సేవ పిలుపు ఇవ్వబడింది. మెస్యను ఈ లోకంలో పెంచి లాలించేటటువంటి ఒక సేవ. ఈ దంపతులు పేద కుటుంభం పరిస్థితి కలవారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకే చోట ఉండి పనిచేస్తూ కుటుంబమును కాపాడుకోనుట అనేది చాలా కఠినమైనది. కానీ యోసేపు ఒకే స్థలములో తన వడ్రంగి పనిని చేయకుండా ప్రభుత్వ లెక్కలు కొరకు బేత్లెహేముకు వెళ్ల వలసి వచ్చింది. హెరోదు కన్నుల నుండి తప్పించుకొనుటకు ఐగుప్తునకు వెళ్ళవలసిన పరిస్థితి. మరల ఇశ్రాయేలు దేశమునకు వచ్చి నజరేతుకు వలస వెళ్లవసిన పరిస్థితి. ఈవిధంగా జరగబోతున్నది అతను ఎరుగనప్పటికి ఒక బాధ్యత గల భర్త వలె యేసేపు తరువాత ఏం చెయ్యబోతున్నాం అనే దానిని ఆలోచించి బాధపడి ఉండవచ్చు. మరియ కూడా ఆవసరతలు గూర్చిన కార్యములు మనస్సులో పెట్టుకొని ఆలోచించి ఉండవచ్చు. ఇప్పటికి సేవ పిలుపును పొందుకున్న అనేకులు సేవ చేస్తే నా ఆవసరతలు సందింప బడతాయ అని ధనమును గూర్చి ఆలోచించి చింతించి సేవకు రావడానికి ఆలస్యం చేస్తున్నారు. చాలా మందికి సేవ చెయ్యాలి అనే ఆశ ఉంది ఆత్మల సంపాదన చెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంది. కాని వారు సంపూర్ణ మరియు పూర్తికాల సేవకు రాకపోవుటకు ముఖ్యమైన ఆటంకం ఏమిటి అంటే భవిష్యత్తులో నా అవసరాలు సందింప బడతాయో లేదో అన్న ఆలోచన. కాని ఈ దంపతులు ఈ ప్రశ్నలు అడిగి వుహించుకున్న భవిష్యత్ బయములను మనస్సులో ఉంచుకొని ఈ సేవ పిలుపును కండిచ లేదు. ని చిత్త ప్రకారం జరుగును గాక అని వారిని సేవకు సమర్పించుకున్నారు. జరిగినది ఏమిటి బాలుడు జన్మించిన కొన్ని వారములలో ఎక్కడి నుండో జ్ఞానలు యొక్క భారీ కుటం వచ్చింది. వీరు ఎవరు అని ఆశ్చర్య పడేలా ఆ బాలుడ్ని మ్రొక్కి నమస్కరించారు. అక్కడ కొంచం కూడా ఊహించని సంఘటన జరిగింది. వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, భోళామును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని మనం చూస్తున్నాం. నిధి అంటే బంగారము ఒక్కటే కాదు సమర్పించిన మిగతా రెండు కూడా విలువైనవని తెలుసుకోన వచ్చును. జన్మించిన యేసుక్రీస్తును పెంచడానికి ఐగుప్తు కు వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు, ఐగుప్తులో అద్దెకు తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వడం. మరియు అక్కడ వడ్రంగి పనులు మొదలు పెట్టడానికి కావాల్సిన పెట్టుబడి డబ్బు అనే ఆవసరతలు సంధించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసారు. 

 

సేవ పిలుపును పొందుకున్న ప్రియులారా నా అవసరత సంధింప బడుతుందా అని ఇంకా సేవకు రావడానికి వెనకడుగు వేస్తున్నారా? విశ్వాసంతో మొదటి అడుగు వెయ్యండి మీ జీవితంలో ఆవసరతలు సందింప బడుటకు ఆయన తన నిధిని ఇచ్చి ఒక్క లోటు కూడా లేకుండా మిమ్మల్ని నడిపిస్తారు. ఆమెన్.

- బ్రదర్. జె.సంతోష్ గారు

 

ప్రార్థన అంశం:-

మన హోంలో ఉన్న పిల్లలకు ఈ చలి కాలంలో ఎటువంటి బలహీనతలు రాకుండా ఉండు లాగున ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet