By Village Missionary Movement
Saturday, 04-Dec-2021దిన ధ్యానము(Telugu) 04.12.2021
అంశం:- ప్రేమ విప్లవం
"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను" - యోహాను 3: 16
అది ఒక అందమైన సాయంత్ర సమయం. హంస ఈదుతున్నట్లు పడవ ప్రయాణం. అందులో రాజు మరియు అతని యొక్క ఒకే ఒక కుమారుడు అలాగే మంత్రి మరియు ఇతర సైనికులు నది యొక్క అందాలను ఆస్వాదించడానికి పడవ ప్రయాణం చేస్తున్నారు. చల్లని గాలి వాళ్ళ యొక్క తల వెంట్రుకలను తాకుతుంది. ఆ సమయంలో రాజుకు మంత్రికి మధ్య సంభాషన మొదలైయింది. మంత్రిని రాజు ఈ విధంగా అడిగారు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ భూమికి ఎందుకు రావాలి ఆయన దూతలలో ఎవరినైనా పంపించ వచ్చుకదా అని రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఉండి పోయాడు. మంత్రి దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు అని రాజు తన మనస్సులో చాలా నవ్వుకున్నాడు. దేనిని చెవిని బెట్టకుండా నీటిలో సంతోషంగా అడుకుంటున్న రాజు కుమారుడు హఠాత్తుగా నీటిలో పడిపోయాడు. రాజు ఆందోళన చెందిన వాడై వెంటనే నదిలో దూకి తన కుమారుడ్ని కాపాడుకున్నాడు. తడిచిన దుస్తులతో ఉన్న రాజును చూసి మంత్రి ఇలా. అడిగాడు మహా ఘనతను వహించిన రాజా! తమరు ఎందుకు నదిలో దుకారు? రాజ కుమారుడ్ని కాపాడుటకు మీ సేవకులలో ఎవరినైనా ఆజ్ఞ పించ వచ్చు కదా? అని అడిగాడు. రాజు చాలా కోపంతో నీటిలో పడిపోయిన వాడు నా కుమారుడు కదా దానికి మంత్రి అవును రాజా ఇదే దేవున్ని స్వర్గం నుండి భూమికి కారణం అయ్యింది అని అన్నాడు మంత్రి.
అవును దేవునికి మనపై ఎంత ప్రేమ ఉంది పాపులమైన మనలను రక్షించుటకు మరియు మనం నిత్యజీవం పొందుకొనుటకు తననే బలిగా అప్పగించు కొన్నారు. మంచి వారి కొరకు ఒకడు మరణించుటకు సిద్ధపడతాడు కాని మనం పాపులమై ఉండగా క్రీస్తు మనకోరకు మరణించుట వలన దేవుడు మనపై ఉంచిన తన ప్రేమను వివరించి బయలుపరిచారు.
ప్రియమైన వారలారా! ప్రేమ యొక్క అర్థమే క్రిస్మస్. అది మాత్రమే కాదు ఆయన భూమిపైకి రావడంతో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని లోక చరిత్రను వేరు పరిచింది. ఆయన జన్మముతో పరలోకం మాత్రమే కాదు భూలోకం కూడా అనదించి సంతోషించింది. భూమి పై సమాధానము మరియు మనుష్యులలో ప్రేమ కూడా కలిగింది. అవును దేవుని ప్రేమను గ్రహిద్దాం ఆ ప్రేమతో నిండిన వారై బ్రతుకుదాం మరియు దానిని ఇతరులకు తెలియ జేద్దాం.
- శ్రీమతి. మంజులా గారు.
ప్రార్థన అంశం:-
హోమ్ పిల్లల విద్య మరియు సకల కార్యములలో మంచి గుణం కలిగి ఉండేలాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250