Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.12.2021
Share:

By Village Missionary Movement

Monday, 06-Dec-2021

దిన ధ్యానము(Telugu) 06.12.2021

 

అంశం:- సత్రముల నిర్వాహకుల సందడి.

 

"తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను" - లూకా 2:7

 

హాలో స్నేహితులారా! చాలా రోజులుగా నేను మీతో మాట్లాడాలి అని ఆశ పడుతున్నాను. ఇది డిసెంబర్ నెల కావడంతో కచ్చితంగా మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను. నేను సత్రాల నిర్వహకుడ్ని. సరే నేరుగా విషయానికి వచ్చేద్దాం. ఔగుస్తు వలన ప్రజాసంఖ్య వ్రాయవలెను అని ఆజ్ఞ వచ్చిన రోజులు అవి. అందరూ వారివారి గ్రామాల్లో ప్రజా సంఖ్య వ్రాస్తున్న స్థలాలకు వెళ్తున్నారు. యూదయా దేశం నుండి బేత్లెహేము అనే దావీదు ఊరిలో నాకు ఒక సత్రం ఉంది. అంతవరకు చాలా అసహ్యంగా ఉన్న నా పశువుల సత్రంలో అప్పుడే శుద్ధి చెయ్యడం మొదలైయింది. అన్ని గదులు నిండి పోవడంతో నేను నెమ్మదితో, ప్రశాంతంగా కుర్చీ పై కూర్చొని ఉన్నాను. అప్పుడు తలుపును ఎవరో తట్టారు. గలీలెయలోని ఉన్న నజరేతు అనే ఊరిలో యోసేపు అనే వడ్రంగి గర్భవతి అయిన తన భార్య మరియతో చాలా ఆలోచిస్తూ భయపడుతూ సత్రంలో స్థలం ఉందా అని అడిగారు స్థలం ఏమి లేదు అని చెప్పాను. ఇద్దరు చాలా కృంగిపోయారు. కాని చాలా పేదవారైన వారిని చూసిన వెంటనే కచ్చితంగా సహాయం చెయ్యాలి అనే ఆలోచన నా మనస్సులో కలిగింది. నా ఇంటి వెనుక ఉన్న గాదెలో ఉంటారా అని మొహమాటంతో అడిగినప్పుడు వారు మిక్కిలి మనస్ఫూర్తిగా అంగీకరించారు. మరియకు ఒక మగ బిడ్డ పుట్టాడు ఆ బాబుకు పొత్తి గుడ్డలతో మాత్రమే చుట్టారు. ప్రకాశవంతమైన మోహము, అందమైన కన్నులు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తరువాత జరిగిన కార్యాన్ని నేను నమ్మలేకపోయాను. అదేంటి బాలుడు పుట్టిన వార్త కన్నవారికి చెప్పకుండా బాలుడ్ని చూచుటకు సంతోషంగా గొర్రెల కాపరులు వచ్చారు. వారి యొద్దకు వెళ్లి మాట్లాడినప్పుడు దేవుని దూతలు ఈ వార్తను మాకు తెలియ జేశారు అన్నారు. దాని తరువాత ఒంటెలు మా ఇంటి ద్వారం యొద్ద వచ్చి నిలబడ్డాయి. ఎవరు అని చూస్తే తూర్పు నుండి జ్ఞానులు యూదుల రాజును చూచుటకు వచ్చాము అన్నారు. ఏంటి రాజా అని నేను ఆశ్చర్యంతో నిలబడినప్పుడు మాకు నక్షత్రం దారి చూపింది అని చెప్పారు. తరువాత వారు తీసుకొని వచ్చిన బంగారము, సాంబ్రాణి, భోళమును రాజుకు బహుమతులుగా అందించారు. నేను సత్రంలో స్థలం లేదు అని చెప్పి విడిచిపెట్టకుండా ఈ చిన్న స్థలమైన ఇచ్చానే అని చాలా సంతోషించాను. ఈరోజుకు యేసుక్రీస్తు జన్మించిన స్థలం అయిన నా సత్రం ఎవరికి నచ్చని స్థలమే. ప్రక్కకు త్రోసివేసిన స్థలమే, కొంచం దుర్వాసన వచ్చే స్థలమే. కాని యేసుక్రీస్తు జన్మించుటకు స్థలం ఇవ్వడంతో అది ఎంత విలువైనదిగా మారిందో మీరే చూడండి. ఒక వేళ మీ యొక్క హృదయం కూడా నా ఇంటి పశువుల సత్రం వలె ఉండవచ్చు. కాని యేసు మీ హృదయంలోనికి వచ్చుటకు స్థలం ఇచ్చినట్లయితే మీ జీవితం కూడా దీవెనకరంగా మరియు ఇతరులు చూసి ఆశ్చర్యపడే విధంగా మారుతుంది అనేది నిశ్చయం. 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు

 

ప్రార్థన అంశం:-

మీడియా పరిచర్య ద్వారా పట్టబడుతున్న ఆత్మలు దేవుని కొరకు ఉజ్జీవంగా బ్రతుకుట కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet bahiscasino betsat betsat pashagaming pashagaming betpas betpas giriş ngsbahis perabet perabet giriş