Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.12.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 07-Dec-2021

దిన ధ్యానము(Telugu) 07.12.2021

 

అంశం:- స్వార్ధపు క్రైస్తవుడు.

 

"అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను" - 1యోహాను 3:8

 

ఒక గిరిజన గ్రామంలో అకస్మాత్తుగా ఒక కొత్త వ్యాధి ప్రబలడంతో అనేక మంది ఆ వ్యాధికి గురయ్యారు. చుట్టు పక్కల ఎక్కడ కూడా వైద్యశాలలు మరియు సహాయం చేసే వైద్యులు లేకపోవడంతో అనేకులు చనిపోతూ ఉండేవారు. ఈ విషాద స్థితిని తెలుసుకున్న ఒక వైద్యుడు ఆ వ్యాధికి సంబంధించిన మందును తీసుకొని వచ్చి కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉండి చికిత్స చేసి తిరిగి వెళ్లిపోవాలి అనుకొని వచ్చారు. వైద్యుడు గ్రామ సరిహద్దుకు చేరుకున్న వెంటనే డాక్టర్ వచ్చేసారు అని సంతోషంతో ఆ ప్రజలు అంతా రెండు మూడు రోజులు పండుగగా విందు చేసి. డాక్టర్ ను పైకి ఎత్తి ఊరంతా పండుగ చేసుకున్నారు. అతను మందులు ఇవ్వడానికి మాత్రమే వచ్చాను అని చెప్పినా సరే మీరు వచ్చేసారు కాబట్టి ఇది మాకు పండగే అని దానిని పండుగలా జరుపుకొన్నారు. అతను తిరిగి వెళ్ళవలసి వచ్చింది అతను బాధతో నేను మీదగ్గరకు వచ్చినది మిమ్మును వ్యాధినుండి స్వస్థపరుచుటకే కాని నేను రావడంతో సందడి చేసి నేను వచ్చిన లక్ష్యమును వృధా చేశారు. నేను తిరిగి వెళ్ళాలి అని మిక్కిలి నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు. ఎంత బాధాకరం. 

 

అపవాది యొక్క క్రియలను లయ పరుచుటకే దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షం అయ్యారు. ఆ అపవాది క్రియలు ఇంకా ప్రతి మనుష్యుని యొద్ద నుండి బయలు పడుతూనే ఉన్నాయి. కోపం, గర్వం, చిరాకు, విరోధం, అత్యాశ, అహంకారం, పగ తీర్చుకోవడం వంటి చెడు గుణములు అన్నీ ఒక మనుష్యుని లోపల సాతాను యొక్క క్రియలను జరిగిస్తూ ఉండటం నిరూపించబడుతుంది. సమాజంలో ఉన్న అన్ని చెడు కార్యములకు కారణం వ్యక్తి యొక్క హృదయం సాతానుకు అప్పగించడం వలన మాత్రమే జరుగుతున్నాయి. మనుష్యులలో జరుగుతున్న ఇటువంటి అపవాది క్రియలను నాశనం చేయుటకు హృదయం లోనికి ఒక రక్షకుడు రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అందుకొరకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చారు. వైద్యుని స్వాగతించడంలో పూర్తి దృష్టి పెట్టి చికిత్స పొందకుండా పోయిన ప్రజలు వలె మనం ఉండక మొదటిగా ప్రభువును మనలో జీవించుటకు అనుమతించాలి. అలా కాకపోతే మనం చేసే అన్నీ ఆరాధనలు, పండుగ సందడి అన్నీ అర్ధరహితమైనవే. అవన్నియు దేవున్ని సంతోష పెట్టక కోపమును తీసుకొని వస్తాయి. ఆయన మనకొరకు సిద్ధపరిచిన పాప క్షమాపణను, రక్షణను, పరిశుద్ద జీవితమును మనం ఆశించి పొందుకొంటే ఆయన మనలను మన ఆరాధనలను చూసి అంగీకరించి ఆనందిస్తారు. మనం పాపము గూర్చి బాధపడక క్రీస్తు జన్మించారు అని సందడి చేస్తూ పండుగ జరుపుకుంటే ఆయన మనలను చూసి కన్నీరు కారుస్తారు. క్రీస్తు లోకమునకు వచ్చిన సంగతి గ్రహించి పండుగను జరుపుకుని సంతోషిద్దాం. 

- బ్రదర్. హానిస్ శామ్యూల్ గారు

 

ప్రార్థన అంశం:-

మీడియా ద్వారా జరుగుతున్న పరిచర్యల కొరకు మరియు దాని కొరకు కావాల్సిన వస్తువుల ఆవసరతలు సందించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort