By Village Missionary Movement
Monday, 13-Dec-2021దిన ధ్యానము(Telugu) 13.12.2021
అంశం:- నిధులను వెతికి
"చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము" – 2 కోరింథీయులకు 9:15
ఇంగ్లాండ్ దేశానికి చెందిన డేవ్ క్రిష్ అనే అతను దాచబడిన నిధులను కనుగొనే పనిలో పాలుపొందుకున్నాడు. ఆ దేశపు నైరుతిలో రహస్య స్థలములో కుప్పలుగా దాచబడిన రొమా నాణెములను కనుగొన్నాడు. దాచబడిన నిధులను కనుగొనే సాధనముతో 52వేలు నాణెములు ఉన్న పెద్ద బిందెను కనుగొన్నాడు. పాతదైన వెండి మరియు కంచు నాణెములు సుమారు 175 కిలోలు బరువు కలిగినది గాను మరియు అది 50 లక్షల విలువ కలిగినది గాను ఉంది. ఆ దినాల్లో డేవ్ కనుగొన్న నిధుల వలన అత్యధిక విలువ కలిగిన నిధులను మనము కనుగొనలేమా అని ఒంటరిగా కలలు కని అలా చెయ్యాలి అని ఆనిపిస్తుంది. దీనిని చదువుతున్న మీరు ఇంకా ప్రత్యేకమైన నిధులను కనుగొనేవారిగ ఉండాలి. మనం వెతికే నిధులు వెండి బంగారము కాదు. ఇది మాణిక్యం వంటిది. మీరు వెతికితే క్రిస్మస్ రోజుల్లో విలువ గల నిధులను చూస్తారు. అవును ఆ నిధి యేసుక్రీస్తే. పరలోకపు దేవుడు భూమిపై మనుష్యులకు విలువ గల నిధి వలె తన సొంత కుమారుడ్ని ఇచ్చారు. ఈ నిధి ఒక మనుష్యునికి భూ సంబంధమైన జీవితమునకు మాత్రమే కాదు పరలోకములో నిత్య జీవమునకు కలిపి ఇవ్వబడింది. ఈ వార్తను వింటున్న మీరు విలువ గల నిధి వలె యేసుని కనుగొన్నారా? మీరు సొంతం చేసుకొన్నారా? మత్తయి సువార్తలో చదివినప్పుడు జ్ఞానులు యేసును చూసి పూజించుటకు చాలా దూరం ప్రయాణము చేశారు. యేసుని చూసిన వెంటనే తమ చేతుల్లో ఉన్న నిధులు అన్నిటికంటే గొప్ప విలువ గల నిధిలా యేసుక్రీస్తు ను చూసారు. ఈరోజు మీరు కూడా యేసుని సొంతం చేసుకోనండి. అదే మీకు విలువ గల నిధి అయ్యిఉన్నది. చెప్ప శక్యం కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఆమెన్.
- బ్రదర్. పి.జాకబ్ శంకర్
ప్రార్థన అంశం:-
జార్ఖండ్ లో నూతనముగా కార్య స్థలం ప్రారంభించుటకు దేవుడు కృప చూపు లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250