Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.12.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 15-Dec-2021

దిన ధ్యానము(Telugu) 15.12.2021

 

అంశం:- కనికరం.

 

"భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు... యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును..." - యెషయా 55:7

 

రక్షణ దళం (salvation army) యొక్క స్థాపకుడు విలియం బూత్ సమాధి కార్యక్రమం రాజుల ఘనతతో జరుగుతుఉన్నది. శవపేటికలో పువ్వులు వేస్తూ ఉన్నారు. వారి మధ్యలో మురికి బట్టలతో నిలబడి ఉన్న ఒక స్త్రీని గమనించారు రాణి. ఆ రాణి ఆమె దగ్గరకు వెళ్ళి " ఈయన నీకు ఎలా తెలుసు ?" అని అడిగారు. అందుకు ఆ స్త్రీ ఈయన " మా వంటి వారి పైన మిక్కిలి కనికరం కలిగిన వారిగా ఉండేవారు " అని జవాబు ఇచ్చారు. " కనికరము అన్నది ఇతరుల వేదనను మన వేదన వలె హృదయములో అంగీకరించుటయే " అని జార్జ్ వైట్ ఫీల్డ్ అనే దేవుని దాసుడు చెప్పారు. 

 

ప్రపంచములో పుట్టిన మనుష్యులు పడుతున్న శ్రమలు అనేకమైనవి. ప్రతిఒక్కరు తమతమ పాపములో చిక్కుకొని వేదనలు అనుభవిస్తున్నారు. ఇంకా కొందరు అయితే రోగము చేత అప్పుల బాధ చేత మరియు కుటుంబంలో పిల్లలు చేత, బంధువుల చేత వేదన చెందుతూ ఉన్నారు. వారు క్రూరమైన పాపములు చేత అతిక్రమముల చేత, దురాశల చేత వేదన చెందుతున్న వాళ్ళు కూడా కలరు. 

 

వీళ్ళందరి వేదనను తన వేదన వలె అంగీకరించిన వ్యక్తి మన రక్షకుడైన యేసుక్రీస్తు. మనం చేసిన పాపములకు ఆయన సిలువ శ్రమ పొందారు. మన ఆలోచనలతో చేసిన పాపానికి తలపై ముండ్ల కిరీటం పెట్టారు. మన హృదయంలో చేసిన పాపము కొరకు ప్రక్కలో బల్లెముతో పొడవ బడ్డారు. మనం చేతులు కాళ్ళతో చేసిన పాపముకు మేకులు కొట్టబడ్డాయి. వేదనలో, పాపములో కొట్టిమిట్టాడుతున్న మనలను వాటిలోనుండి రక్షించుటకు ఈ లోకంలో శరీరదారిగా పుట్టిన రక్షకుని యొక్క కనికరమును ఆలోచించి చూడండి. 

 

అవును ప్రభువు యొక్క కనికరము వలనే మనము రక్షించబడి నీతి మంతులుగా చేయబడ్డాం. అలాగే మనం కూడా ఇతరుల యొద్ద కనికరముతో నడుచుకుందాం. ఇతరుల యొక్క లోపములను, తప్పిదములను క్షమించి అంగీకరించి క్రీస్తు స్వభావమును వ్యక్త పరుద్దాం. 

- శ్రీమతి. జాస్మిన్ పాల్.

 

ప్రార్థన అంశం.

సత్యం టీ. వి, నంబికై టీ. వి మరియు సోషల్ మీడియాలో సహోదరులు డేవిడ్ గణేషన్ గారు ఇస్తున్నా సందేశం ద్వారా అనేకులు రక్షింపబడేటట్లు ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet