By Village Missionary Movement
Thursday, 16-Dec-2021దిన ధ్యానము(Telugu) 16.12.2021
అంశం:- వాగ్దానమా? శరీరమా?
"ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను" - యోహాను 1:14
మార్గశిర మాసంలో వణుకుతున్న చలిలో గాఢ నిద్రలో ఉన్నారు తల్లిదండ్రులు. అప్పుడు తెల్లవారుతుండగా హఠాత్తుగా తమ యొక్క పసికందులు బిగ్గరగా ఏడుస్తున్న ఏడుపు విని లేచారు తల్లిదండ్రులు. 10 సంవత్సరాలుగా కన్నీటి లోయలో గుండా నడుస్తూ వెళ్లిన వాళ్ళ యొక్క అరణ్య జీవితంలో రెండంతలు మేలు చేసెదను అనే దేవుని వాగ్దానము ప్రకారము ఇద్దరు కవల పిల్లలు ఒక నెలకు ముందే వారు జన్మించారు. పిల్లల యొక్క ఏడ్పు స్వరము విని వాళ్ళ ఆకలి తీర్చుటకు ప్రయత్నం చేశారు. తన అమ్మమ్మ ఇచ్చిన పాల బుడ్డితో ఆకలి తీర్చినా గాని ఆ చిన్న వాని యొక్క ఏడ్పు ఆగలేదు. అమ్మమ్మ ఇచ్చిన పాల బుడ్డిపై అమ్మ మనస్సు పెట్టకుండా ఏడుస్తూ ఉన్న చిన్న వాడిని ఎత్తుకొని కౌగలించుకొంది. పిల్లలు హాస్టల్లో ఉండేటప్పుడు నేర్చుకున్న పాటను పాడడం ప్రారంభించింది. పుట్టి నెలరోజులే అయినప్పటికీ తల్లి యొక్క స్వరాన్ని గ్రహించిన ఆ పసికందు ఏడ్పును అపి తల్లి వడిలో హాయిగా నిద్రపోయాడు. పెద్దవాడు అయితే ఆకలిని పాలతో సరిపెట్టుకొని నిద్రపోయాడు. చిన్నవాడు అయితే తల్లి ప్రేమ గలిగిన మాటలతో మరియు కౌగిలిలో సంతృప్తి చెందాడు.
బైబిల్లో కూడా ఏశావు, యాకోబు అనే కవల సహోదరులు తన తండ్రి ఆశీర్వాదములను పొందుకొనుటకు ఆశించారు. చిన్నవాడైన యాకోబు తన పెద్ద కుమారుడు వలె వేషం ధరించి మోసగించి తండ్రి దీవేనను వాగ్దానముగా పొందుకొన్నాడు. ఏశావు అయితే తన తండ్రికి ఉన్న ఆస్తులను తన జీవితాంతం అనుభవించాడు. తండ్రి యొద్ద నుండి వాగ్దానముగా దీవెనలు పొందుకొన్న యాకోబు ఏమి లేనివాడిగా వట్టి చేతులతో కర్ర పట్టుకొని బయలుదేరి నప్పటికి ఆయన తండ్రి ఇచ్చిన వాగ్దానం అనే దీవెనలు పొందుకొని కర్ర పట్టుకొని ఇశ్రాయేలు జనాగంమునకు తండ్రిగా మారిపోయాడు. తరువాత సంతతి అందరికి ఆ దీవెనలు కొనసాగుతూనే ఉన్నాయి.
అలాగే మన జీవితంలో మనము అనేక వాగ్దానాలు పొందుకొని ఉన్నప్పటికీ వాటన్నింటిని అనుభవించి దృఢముగ పట్టుకున్న యెడల విశ్వాసముతో వాటన్నింటిని స్వతంత్రించుకుంటాం . వాగ్దానాలు అన్ని తప్పకుండా నెరవేరుతాయి. శరీర దారి అయిన యేసుక్రీస్తు మాట తప్పని దేవుడు. యాకోబు తనను తన సహోదరుని యొక్క పేరుచెప్పి తండ్రి యొద్ద నుండి దీవెన పొందుకున్నట్లు మనము కూడా మన పెద్ద సహోదరునిగా ఉంటున్న యేసుక్రీస్తు నామములో తండ్రి యొద్ద దీవెనలు పొందుకొనుటకు మనము ముందు ఉందాం.
- శ్రీమతి. వసంతి రాజా మోహన్
ప్రార్థన అంశం:-
ఆంధ్ర రేగా పుణ్యగిరి కొండపైన గల దేవుని మందిరము యొక్క కట్టడ పనులు త్వరగా పూర్తి అయ్యేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250