By Village Missionary Movement
Saturday, 18-Dec-2021దిన ధ్యానము(Telugu) 18.12.2021
అంశం:- "తండ్రి ప్రేమ".
"క్రీస్తు మిమ్మును ప్రేమించెను... ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి" - ఎఫెసీయులకు 5: 2
సముద్ర తీరం వైపు ఒక నావ వస్తుంది. అది ప్రపంచం అంతా సువార్తను తీసుకు వెళ్లే లోగోస్ నావ. అది OM (ఆపరేషన్ మొబలైజేషన్) అనే పరిచర్యకు చెందినది. దాని జెండా ఎగురవేస్తున్న స్తంభం పై గంబిరంగా ఎగురుతున్న జెండాపై ఇలా ముద్రించబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను (యోహాను 3: 16). అవును తండ్రి ప్రేమ ఈ వాక్యం ద్వారా ఎంత చక్కగా వివరించబడుతుంది.
దేవుడు ఈ లోకమును అందంగా సృష్టించారు. దాంట్లో అందరు సంతోషంగా జీవించాలి అన్నదే ఆయన యొక్క కోరిక. పచ్చిక గల ఏదేను తోటను సృష్టించి దాంట్లో ఆదాము, హవ్వ దంపతులను పెట్టారు. దాంట్లో అవిధేయత అనే పాపము వాళ్ళ యొక్క సంతోషాన్ని పాడుచేసింది. మానవుడు పాపపు ఊబిలో చిక్కుకున్నాడు. ఇలాంటి మానవ జాతిని పాపము నుండి మరణ భయము నుండి విమోచించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చారు. దేవుడు తన సొంత కుమారుడ్ని దయచేయుట వలన పాపుల మైన మనమీద ఆయన పెట్టుకొన్న ప్రేమను వ్యక్త పరిచారు.
క్రిస్మస్ తండ్రి యొక్క ప్రేమకు ప్రత్యక్షత. యేసుక్రీస్తుని అనుగ్రహించి ఇంతగా ఆయన మనలను ప్రేమించారు అన్నదాంట్లో నుండి దేవుడైన తండ్రి యొక్క మితిలేని ప్రేమను చూస్తున్నాం. మనం మంచి వాళ్ళము అని కాదుగాని మనం పాపులుగా ఉండేటప్పుడు మనలను ప్రేమించి తన కుమారుడ్ని ఈ లోకానికి పంపించారు. ప్రభువైన యేసుక్రీస్తు తన రెండు చేతులు చాపి మన మీద పెట్టుకున్న ప్రేమను చూపిస్తున్నారు.
ప్రియమైన వారలారా ప్రేమ ఇది బైబిల్ యొక్క కేంద్ర బిందువు, క్రైస్తవ జీవితం యొక్క కేంద్రం కూడా అదే. దేవుడు మనలను ప్రేమించినట్లుగా మనం కూడా ఒకరినొకరు ప్రేమింప బద్ధులై యున్నాము. ఇదే ప్రధాన ఆజ్ఞగా ఉంది. కాబట్టి ఈ క్రిస్మస్ దినములలో కూడా మనము ఎవరి మీదనైనా చేదైన కార్యం లేక శత్రుత్వం కలిగి యున్నాము అంటే వాటన్నింటిని మంచి మనస్సులో సరిచేసుకొనుటకు ప్రయాస పడదాం. ఒక చిన్న నవ్వుతో గ్రీటింగ్ కార్డ్ పంపించి మన ప్రేమ సందేశాన్ని పంచుకుందాం. ఇవన్నీ మన బంధాన్ని కలిపే వంతెనల ఉంది. ఈ క్రిస్మస్ కాలము దానికి తగిన కాలము. కాబట్టి ఇతరులను ప్రేమిద్దాం. మనకు కీడు చేసిన వాళ్లకు కూడా మేలు చేద్దాం. శత్రువులను ప్రేమిద్దాం క్రీస్తు ప్రమానమును నెరవేరుద్దాం.
- బ్రదర్. డేవిడ్ ధవమణి.
ప్రార్థన అంశం:-
మోక్ష ప్రయాణము మ్యాగజైన్ కు రాసి ఇస్తున్న వ్యక్తులను దేవుడు విశేషమైన ఆత్మతో నింపేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250