Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.12.2021
Share:

By Village Missionary Movement

Monday, 20-Dec-2021

దిన ధ్యానము(Telugu) 20.12.2021

 

అంశం:- అనుభవించండి, ప్రకటించండి

 

"వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి" - లూకా 2:17

 

లోకంలో ప్రతి మనిషి కూడా తమ చెవులారా అనేక కార్యాలను వింటూ ఉన్నారు. విన్నది మంచిదా? చెడ్డదా? అనేది ఎలాగు చూడాలి. దానిని తన సొంత అనుభవంలో ఎలాగు అనుభవించాలి అని ప్రతి ఒక్కరు ఆశక్తితో ఉన్నారు. మూడవదిగా ఒక కార్యం జరుగుతుంది దానిని ప్రకటించుట. అనగా ఇతరులకు పంచిపెట్టుట. ఈ దినము సోషల్ మీడియాలో ఇదే ప్రాముఖ్యమైన కార్యం. తమకు ప్రయోజనము అయిన ఒక కార్యాన్ని అనేకులకు షేర్ చెయ్యాలి అని అనేకులు గురిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఎక్కడో ఒక మూలలో తీయబడుతున్న ఫోటో ప్రపంచం అంతా కూడా చుట్టూ తిరిగేస్తుంది. 

 

పరిశుద్ద గ్రంధం అయిన బైబిల్లో లూకా సువార్త లో యేసుక్రీస్తు జన్మను గురించి దేవదూతలు గొల్లలకు ప్రకటిస్తున్నారు. గొల్లలు అయితే దానిని శ్రద్ధగా విన్నారు. విన్న తరువాత గొల్లలు తమలో తాము మాట్లాడుకొని ఆలోచన చేస్తున్నారు. ఆలస్యం చెయ్యకుండా కఠోరమైన చలి కాలం అని చూడకుండా ఆశక్తితో త్వరగా వెళ్లి మరియను మరియు యోసేపును, యేసుక్రీస్తు ను దర్శిస్తున్నారు. తరువాత వారు చేసినదే ప్రధానమైన కార్యం. తాము విన్నవాటిని, కన్నవాటిని ప్రకటించడం మొదలు పెట్టారు. అది ఎంత మంచి ఉదాహరణ. దానిని విన్న అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు గొల్లలు ఈలాగు యేసు ప్రభువు పుట్టుకను ప్రకటిస్తున్నారు. 

 

స్నేహితులారా! ఈ రోజు మన పరిస్థితి ఏమిటి? దేవుని గుర్చిన ఆశక్తి మనలో ఉందా? ఆయన కార్యములు అనుభవించాలి అని ఆలోచిస్తున్నామా? లేదా విడిచిపెట్టేస్తున్నామా? దానిని ఇతరులకు ప్రకటించుటలో మనం ఎంతగా తొందర పడుతున్నాం. దీనిని వ్రాస్తున్నప్పుడు దేవుని సేవకుడైన ఎమిల్ల్ జబసింగ్ గారు వ్రాసిన మాట గుర్తుకు వస్తుంది. యేసుక్రీస్తు ను గ్రహించు కొనుము, అనుభవించుము, ప్రకటించుము అన్నదే. అవును చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనే ప్రపంచాన్ని కలిగి ఉన్నాం. దాంట్లో వ్యర్థముగా సమయాన్ని పోనివ్వక ఇతరులకు దేవుని గూర్చిన కార్యములు ప్రపంచ మూలలో ఉన్న అందరికి దానిని పంపిద్దాం. అది మన చేతుల్లోనే ఉంది దానిని గ్రహించి పనిచేద్దాం, లోకాన్ని యేసు కొరకు సొంతం చేద్దాం. 

- బ్రదర్. టి.శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

మనతో కలిసి పనిచేస్తున్న పాట్నర్ షిప్ మిషనరీ పరిచర్యలో దేవుడు బలముగా వారిని వాడుకొనేల ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet