Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.12.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 21-Dec-2021

దిన ధ్యానము(Telugu) 21.12.2021

 

అంశం:- అలంకరించ బడిన ఇల్లు.

 

"...జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా" - లూకా 19:5

 

ఆ అందమైన ఇల్లు చాలా సందడితో నిండి పోయింది. అలంకరణ లైట్లుతో ఒక వైపు అలంకరించబడియుంది. అందరు పనుల్లో చాలా బిజిగా ఉన్నారు. ఇంటిని శుభ్రం చేయుట అనేది జరుగుతూవుంది. వంట గదిలో సువాసనతో కుడిన వంటలు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇంతకీ ఆ ఇంట్లో జరుగుతున్న కార్యం ఏమిటి? 

 

ఆ ఇంట్లో గల ఒక్క గాని ఒక్క కుమారుడి యొక్క పుట్టినరోజు. అందుకే ఇంత హడావుడి కలిగిన పని ఆ ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో గల తండ్రికి చెవిలో పెట్టిన ఫోన్ తీయడానికి సమయం లేనంతగా అందరుతో మాట్లాడు తున్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. ఉదయం నుండి ఆ బాలుడికి ఆహారం పెట్టడం మర్చిపోయారు. నోరు తెరచి అడగలేని ఆ బాలుడు అయితే ప్రతి ఒక్కరి మోకాన్ని చూస్తూ అలా ఉండి పోయాడు. అలంకరించబడిన ఇల్లు, మనిషి అంత ఎత్తు గల కేకు, రుచికరమైన వంటలు వీటన్నింటితో సాయంత్రం కార్యక్రమం ప్రారంభం అయ్యింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బాలుడికి విలువైన వస్త్రములు, బంగార నగలు, బహుమానములతో ఆ బాబును ముంచి వేశారు. కేక్ కట్ చేస్తున్న సమయంలో ఆ బాలుడు ఆకలి తట్టుకొనక కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పుడే తల్లిదండ్రులకు అర్థం అయ్యింది ఆ బాబుకు ఆహారం పెట్టలేదు అని. 

 

అవును సహోదరి సహోదరులారా! క్రిస్మస్ వేడుకకు చాలా సందడితో సిద్ధపడుతున్నా మనకే ఈ సందేశం. క్రిస్మస్ అలంకరణ, కొత్త బట్టలు, అందమైన నక్షత్రాలు, మెరుస్తున్న విద్యుత్ దీపాలు, ఇవన్నీ మంచివే. కాని క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యమైన వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన మీ ఇంటిలో ( మీ హృదయంలో) ఉన్నారా? ఆయనకు తగిన అలంకరణ పరిశుద్ధత, ప్రేమ, సంతోషం, సమాదానం మనలో ఉన్నదా? ఆయన మనలో నివసిస్తూ ఉన్నారా? 

 

ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. (ప్రకటన గ్రంథం 3: 20) ఎలాగు సుంకరి అయిన జక్కయ యేసయ్యను తన ఇంటిలోనికి ఆహ్వానించి రక్షణను పొందుకున్నాడో అలాగే మనం కూడా క్రీస్తుని మన హృదయంలోను, మన గృహంలోను, ఆహ్వానించి ఆయన జన్మదినాన్ని కొనియడదాం. క్రిస్మస్ రోజున మాత్రమే కాదు అన్ని వేళల్లో కూడా మనం మన జీవితంలో కొనియడా దగిన దినముగానే ఉంటుంది.

- శ్రీమతి. మంజుల

 

ప్రార్థన అంశం:-

సేవకుల కొరకు ముద్రించ బడుతున్న స్పెషల్ మ్యాగజైన్ పొందుకున్న సేవకులు దానిని చదివి దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet cashwin tambet grandpashabet bahiscasino amgbahis betbey amgbahis radissonbet betpuan cashwin matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet