Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.12.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 22-Dec-2021

దిన ధ్యానము(Telugu) 22.12.2021

 

అంశం:- భయపడకుము.

 

"....జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది" - లూకా 1:13

 

క్రిస్మస్ కాలానికి దగ్గర అవుతున్నాము అనే సంతోషం మన హృదయంలో ఎక్కువగా ఉన్నప్పటికీ జీవితంలో ఎప్పుడు మనలను ఇరికింప చేస్తున్న కొన్ని కార్యములు గురించిన భయము ఎప్పుడు మన హృదయంలో ఉంటూనే ఉంది. ఈ దినము కూడా క్రిస్మస్ సంఘటనలో భయపడకుము అని దేవుడు చెప్పిన ఆజ్ఞను ధ్యానించుట సరిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. 

 

జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, (లూకా 1:13). అనేక సంవత్సరాలుగా తమకు ఒక బిడ్డ కావాలి అని జకర్యా ప్రార్ధించి ఉంటాడు. కానీ యేసుక్రీస్తు జన్మించుటకు ఆరు నెలలు ముందే బాప్తిస్మము ఇచ్చు యోహాను పుట్టి క్రీస్తు కొరకు మార్గం సరాలము చెయ్యాలి అన్నది తండ్రి చిత్తమై యున్నది. కాబట్టి ఆలస్యంగా జవాబు దొరుకుతుంది. ఇంకను మీ ప్రార్ధనలో కొన్నింటికి జవాబు రావడం ఆలస్యం అవుతుందా? ప్రార్ధించి మీ మోకాళ్ళు అలసిపోయి ఉండవచ్చు. ప్రియమైన వారలారా భయపడకుడి దేవుడు ఆలస్యం చెయ్యడు అని కాదు ఆయన ఆలస్యం చేసిన మేలైన వాటిని దయచేస్తారు. 

 

మరియ, భయపడకుము; దేవుని వలన నీవు కృపపొందితివి (లూకా 1: 30). కృపను ఎవరు పొందుకొనగలరు? దీన మనస్సు గల వారు మాత్రమే. ఎంత వెల పెట్టినా ఎక్కడ కొనలేని కృపను మరియ ఉచితముగా పొందుకున్నది. మరియ ఒక సాదారనమైన కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే. లోక రక్షకుడు జన్మించుటకు దేవుడు ఆమెను ఏర్పరుచుకొనుటకు గల కారణం ఏమిటి? వేలకొలదిగా ఉన్న యూదుల కన్యకలు మధ్యలో మరియ దేవుని దృష్టిని ఆమె వైపు మళ్లించు కొన్నది. ఈ దినము మీ యొక్క పరిస్థితిని గురించి చింతిస్తున్నారా? మరియ వలె ధీన మనస్సు కలిగి ఉండండి మీకు హెచ్చింపు దగ్గరనే ఉంది. 

 

గొర్రెల కాపరులను చూసి ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; (లూకా 2: 10). దేవదూతలు ఈ మాటలను గొర్రెల కాపరులకు చెప్పి నప్పుడు రాత్రివేళ సమయం. రాత్రి అన్నది ఎవ్వరు పని చెయ్యలేని సమయం. ఆ సమయంలో శుభవార్త ప్రకటించబడింది. దీని చదువుతున్న మీ యొక్క జీవితం చీకటిగా కనబడుతుందా? ఎటువైపు అడుగు వెయ్యాలో లేక ముందుకు వెళ్ళాలో అని ఆలోచిస్తు నిలబడియున్నారా? భయపడకుడి మీ యొక్క జీవితానికి వెలుగు కలిగించడానికి ప్రభువు ఉన్నారు. ప్రతి దినము ఆయన ముఖ దర్శనము వెదకిన యెడల మీ మోఖము ప్రకాశవంతంగా అగును. భయపడకుడి నేను మీకు తోడై యున్నను (యెషయా 41:14).

- సిస్టర్. ఎస్.జయకుమారి

 

ప్రార్థన అంశం:-

ఒక గ్రామంలో ప్రత్యేకమైన క్రిస్మస్ పరిచర్య చేయుటకు 5000 రూపాయలు వరకు అవసరమైయుంది. దానికి సహాయం చేసేవారు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort