Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.12.2021
Share:

By Village Missionary Movement

Saturday, 25-Dec-2021

దిన ధ్యానము(Telugu) 25.12.2021

 

అంశం:- వెలుగు వచ్చేసింది.

 

"దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు" - ఆదికాండము 1:14

 

వెల్కమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ దినము క్రిస్మస్ దినము. మన అందరికి సంతోషమే కదా? సంవత్సరానికి ఒక్క సారి క్రిస్మస్ వస్తుంది. రంగురంగుల లైట్స్ తో మనం కొనియాడుతున్నాము. సరే మన అనుదిన జీవుతంలో వెలుగు ఉందా? నాకు తెలిసిన ఒక బాబు ఉన్నాడు. వాడికి చదువు రాలేదు. తల్లిదండ్రులకు లోబడే గుణము లేదు. దీనిని తలంచి వాని యొక్క తల్లి నా యొద్ద కన్నీరు కారుస్తూ వాడికి మంచి సలహా చెప్పమని నా యొద్దకు పంపించారు. నేను ఆ బాలుడ్ని పిలిచి అడిగాను అందుకు వాడు చెప్పాడు అక్క మా నాన్న రోజు తాగేస్తున్నారు. నేను చదువులో శ్రద్ధ చూపించలేకపోతున్నాను. తల్లిదండ్రులకు లోబడాలి అనే మనస్సు కూడా నాకు పుట్టలేదు అని కన్నీటితో చెప్పాడు. తమ్ముడు నీ పేరు ఏమిటి అని అడిగాను. అందుకు ఆయన చెప్పిన జవాబుకు నా కన్నులలో కన్నీరు వచ్చింది. వాడి పేరు బ్రైట్. వాడి యొక్క పేరు బ్రైట్ గాని వాడి యొక్క జీవితంలో చిన్నప్పటి నుండి డార్క్ వలె మారిపోయింది. 

 

పైన చెప్పబడిన వాక్యనుసారంగా వెలుగు కిరణములను(లైట్) లోకములో సృష్టించి రాత్రికి పగలకు మధ్య వ్యత్యాసం సృష్టించి వేరు చేశారు మన దేవుడు. మన దేవుడు సృష్టించిన ఈ లైట్ లోకంలో క్యాలెండర్ రావడానికి కారణం అయ్యింది. ఈ దినము ఈ లైట్ లేని యెడల మనము దినములు, నెలలు సంవత్సరాలు క్రిస్మస్, న్యూఇయర్ అని చెప్పలేం. ఆయన సృష్టించిన వెలుగునకు ఇంత శక్తి ఉండిన యెడల మరి ఆయనే మన ఙివితం లోనికి వచ్చిన యెడల మన జీవితం ఎంత ప్రకాశవంతంగా మారిపోతుంది. యేసయ్య ఆ వెలుగు ఆయన ఈ లోకంలో జన్మించి ఎక్కడో చీకటిలో ఉండిన మనలను వేరుచేసి అందమైన వెలుగు లోనికి తీసుకు వచ్చారు. ఫ్రెండ్స్ ఈ దినము మాత్రమే క్రిస్మస్ కాదు చీకటిలో ఉండి వెలుగులోకి వచ్చిన మన అందరికి డైలీ క్రిస్మసే. దీనిని చదువుతున్న వారు ఆలోచించండి. నేను అడిగిన ప్రశ్న వలె మీ జీవితంలో కూడా బ్రైట్ నెస్ వచ్చిందా? ఈ దినము నా జీవుతంలో డల్ గా వున్నాను అని చెప్పే వారు వినండి ఇప్పుడే యేసయ్య ను మీ జీవితంలోకి ఆహ్వానించండి. మీరు మాత్రమే కాదు మీ ద్వారా ఇతరుల జీవితం కూడా ప్రకాశం వంతంగా మారిపోతుంది. మేరీ క్రిస్మస్ టు అల్.

- బ్రదర్. వి. విశాల్.

 

ప్రార్థన అంశం:-

ఈ దినము మన పిల్లల కోటై క్యాంపులో జరుగుతున్న క్రిస్మస్ కార్యక్రమంలో అనేకులు పాల్గొని అందరూ పరలోక ప్రజలుగా మారేటట్లు ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet