Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.12.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 26-Dec-2021

దిన ధ్యానము(Telugu) 26.12.2021 (Kids Special)

 

ధనము! అది ఎన్నడును నిద్రపోదు.

 

"సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును" - 2 కోరింథీయులకు 9: 7

 

హాలో పిల్లలు స్కూల్ ఓపెన్ అయింది కదా మూయబడిన ద్వారాములు అన్నింటినీ యేసయ్య మీ కొరకు తెరచి అద్భుతాలు చేశారు చూసారా? రోగాలు అన్ని తగ్గిపోయేటట్లు యేసయ్య మీకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీరు యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పారా? ఇప్పుడే చేతులు జోడించి యేసయ్యకు థాంక్స్ చెప్పండి. వెరీ గుడ్. డైలీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చెయ్యడం మర్చిపోకుడదు సరేనా? ఒకే కథ విందమా? 

 

ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు చాలా ఆస్తి మరియు చాలా తోటలు ఉండేవి. అన్ని విధములుగా ధనములు సమకూర్చుతూ ఉండేవాడు. ఆ ధనము ఏమి చెయ్యాలో తెలియక అదే విధంగా తాను తన కుటుంబం మంచిగా వుండాలి అని ఆలోచిస్తూ వుండేవారు ఆ ధనవంతుడు. ఎవరికైన సహాయం చెయ్యాలి అని ఎన్నడు ఆలోచన చెయ్యనే చెయ్యారు. ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఉంటే దొంగలు వచ్చి ఆ డబ్బు దొంగిలిస్తారు అని ఎరిగి ఆ డబ్బు అంతటిని ఒక పెట్టెలో పెట్టి తోటలో ఉన్న ఒక చెట్టు క్రింద గుంటను త్రవ్వి దానిని పాతిపెట్టేవారు. అమ్మాయ్య ఎవరు తీయలేరు అని సంతోషిస్తూ ఉండేవాడు. వర్షం పడితే ఆ వర్షం నీరు పెట్టెలోనికి వెళ్ళిపోయి డబ్బులు తడిచిపోతాయేమో అని నిద్రపోయేవారు కాదు. ఉదయాన్నే తొందరగా అక్కడికి వెళ్ళి మట్టిని తవ్వి ఆ పెట్టెను తెరిచి చూసేవారు. డబ్బులు భద్రంగా ఉండుట చూసి ప్రశాంతంగా ఉండేవారు. దానిని గమనిస్తున్న ఒక పనివాడు ఎవ్వరికీ తెలియకుండా ఆ డబ్బును దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. ఒక రోజు ధనవంతుడు పెట్టెను తెరిచి చూసినప్పుడు డబ్బులు కనపడకపోవడం వలన బిగ్గరగా కేక వేస్తూ ఏడ్చారు. అయ్యో ఈ ధనవంతుడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అందరూ వచ్చారు. జరిగిన దానిని విన్నవారందరు డబ్బును ఎవరైనా భూమిలో దాచిపెడతారా? ఎవరికి ప్రయోజనం లేని ఈ డబ్బు ఉండి ఎందుకు అని అందరూ మాట్లాడసాగారు. వాటిని విన్న ధనవంతుడు తన మనస్సును మార్చుకొని ఆ దినము మొదలుకొని ఇతరులకు సహాయం చెయ్యడం మొదలుపెట్టారు. 

 

ప్రియ తమ్ముడు చెల్లి దేవుడు మనకు ఇచ్చిన ధనమును, దీవెనలు మనం మాత్రమే అనుభవించుట కాదు గాని ఆవసరతలో ఉన్న వారికి సహాయం చెయ్యాలి. ఆ ధనవంతుడు వలె ఇతరులకు ఇవ్వకుండా ఉండకూడదు. వచ్చే నూతన సంవత్సరంలో అవసరతలో ఉన్న వారికి సహాయం చెయ్యాలి. చేస్తాము అని నిర్ణయించు కుంటారా? ఒకే.

- సిస్టర్. దేబోరా

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet