Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.01.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 02-Jan-2022

దిన ధ్యానము(Telugu) 02.01.2022 (Kids Special)

 

అంశం:- చాల్లేట్ నువ్వే.

 

"ఆకాశపక్షులను చూడుడి... మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?" - మత్తయి 6:26

 

హాలో పిల్లలు ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని చూచుటకు చాలా సంతోషం. గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనలను కనుపాప వలె సంరక్షించి సమస్త కీడులనుండి మనలను తప్పించి మనలను రక్షించిన ప్రభువుకు కృతజ్ఞతలు చెబుదాం. ఎంతో మంది క్రిందటి సంవత్సరం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం లేరు కదా? మన అందరిని కూడా యేసయ్య ప్రాణముతో సజీవంగా ఉంచి యున్నారు కదా. అందుకు యేసయ్య నీ చిత్తం మా జీవితంలో జరగనివ్వండి అని మీరు దేవుని హస్తం క్రింద మిమ్మల్ని నడిపించమని మనలను మనం సమర్పించు కుందాం. సరేనా పిల్లలు కథ విందమా? 

 

బెనిట, జెనిట అనే ఇద్దరు చిన్నారులు ఢిల్లీలో ఎదుగుతూ ఉన్నారు. ఇద్దరు కూడా నల్లగా ఉంటారు. వాళ్ళ ఇంటిపక్కన అందమైన పార్క్ ఉండేది. అప్పుడప్పుడు అక్కడకు ఆడుకోవడానికి ఆ పార్కుకు వెళ్లేవారు. మీరు కూడా వెళ్లారు కదా? మీరు అక్కడకు వెళ్లి ఉయ్యాల, జారుడు బల్ల అడుకుంటారు కదా అలాగే బెనిట, జెనిట అడుకుండేటప్పుడు కాకి కాకి అని మిగిలిన పిల్లలు హేళన చేస్తూ ఉండేవారు. ఉత్తర భారతదేశ పిల్లలు తెల్లగా ఉంటారు కాబట్టి అలా హేళన చేసేవారు. దానిని వింటున్న చిన్నారులు చాలా బాధపడేవారు. దేవుడు మమ్మల్ని ఎందుకు ఇంత నల్లగా చేశారు కొద్దిగా తెల్లగా చేసియుంటే ఇలా హేళన చేసేవారు కాదు అని బాధతో ఉన్నారు. వీటన్నింటినీ గమనించిన అమ్మ తన పిల్లల్ని పిలిచి ఏమైంది అని అడిగింది. అందుకు వారు మమ్మల్ని కొందరు కాకి అని పిలుస్తున్నారు అని అన్నారు. ఎవరు చెప్పారు మీరు కాకి అని మీరు కాకి కాదు చాక్లెట్ అని అమ్మ చెప్పిన వెంటనే వాళ్ళ ముఖములో నవ్వులు కనబడడం ప్రారంభించాయి. ప్రభువు మిమ్మల్ని ఆయన పోలికలో చేసి యున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి అదే దేవునికి ఇష్టమైనది కూడా అని అమ్మ చెప్పిన వెంటనే వాళ్లిద్దరూ గంతులు వేయడం ప్రారంభించారు. వెంటనే ఆడుకోవడానికి వెళ్లి పోయారు. మేము చాక్లెట్ మమ్మల్ని అందరూ ఇష్టపడతారు. యేసయ్యకు చాలా ఇష్టం ఎందుకు అంటే ఆయన దృష్టిలో మేము చాలా విశేషమైనవారం. వాళ్ళ యొక్క మనస్తత్వంలో మార్పు వచ్చింది. 

 

తమ్ముడు చెల్లి మీరు కూడా నేను నల్లగా ఉన్నాను, అందంగా లేము పేద వారిగా పుట్టాము అని బాధ పడుతుంటారేమో మీరు కూడా యేసయ్య దృష్టిలో చాలా స్పెషల్. మీరు చాక్లెట్ వంటి వారు పిల్లలు మీకు చాక్లెట్ అంటే ఇష్టమే కదా? అలాగే మీరు అంటే యేసయ్యకు చాలా ఇష్టం. సరేనా ? వెరీ గుడ్.

- శ్రీమతి. జీవ విజయ్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet