Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.01.2022
Share:

By Village Missionary Movement

Friday, 07-Jan-2022

దిన ధ్యానము(Telugu) 07.01.2022

 

అంశం:- పరిశుద్ధత.

 

"...నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను" - లేవీయకాండము 20:8

 

19వ శతాబ్దంలో యాల్పానము అనే పట్టణములో ఇద్దరు వ్యక్తులను హతమార్చి నందుకు సుబ్రమని అనే వ్యక్తి ఖైదు చేయబడి చెరసాలలో వేయబడ్డాడు. దీనిని విచారించిన న్యాయమూర్తి ఈయనకు ఉరి శిక్ష వేయాలని ఆజ్ఞపించారు. ఆ దినములలో బ్రికేన్ రిజ్ అనే వ్యక్తి శ్రీలంక చెరసాల ఖైదీల మధ్యలో పరిచర్య చేస్తూ వచ్చారు. బ్రికేన్ రిజ్ ప్రకటించిన సువార్త ద్వారా సుబ్రమని యేసుక్రీస్తుని అంగీకరించి నన్ను ప్రేమించే యేసుక్రీస్తు ఒకరు ఉన్నారు అనే నిరీక్షణతో బైబిల్ చదవడం ప్రారంభించారు. యేసుక్రీస్తు నా పాపములు క్షమించారు అని పాప క్షమాపణ నిశ్చయతతో ఆయన వాక్యం ఇస్తున్న సత్య సమాదానాన్ని అనుభవించిన వారిగా తాను రుచి చూచిన దేవుని ప్రేమను ఇతరులకు ప్రకటించుచు వచ్చారు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మరణ భయం లేకుండా ఉరి శిక్షకు ధైర్యంగా నిలబడ్డారు. ఆయన మరణించడానికి ముందు "యేసు నన్ను ప్రేమిస్తున్నారు" అనే పాటను వ్రాసారు. ఆ పాట ఇప్పటి వరకు మన సంఘాల్లో పాడబడుతున్న ఒక పాటగా ఉంది. 

 

పరిశుద్ద గ్రంధంలో అపోస్తులుడైన పౌలు, సీల సువార్త ప్రకటించారు. దాని కొరకు చెరసాలలో బంధింపబడ్డారు. చెరసాలలో వీళ్ళు ప్రార్ధించినప్పుడు దేవుడు వీళ్ళ బంధకములు అన్నింటినీ తీసి వేశారు. అప్పుడు చెరసాల అధికారి నిద్ర మేలుకొని చెరలో ఉన్న ఖైదీలు అందరూ పారిపోయారు అని తలంచి ఆత్మహత్య చేసుకొనుటకు ప్రయత్నించారు. అప్పుడు పౌలు అతనిని అపి ఆ చెరసాల అధికారికి సువార్త ప్రకటించారు. దాని ద్వారా ఆయన మారుమనస్సు యేసుక్రీస్తుని అంగీకరించి తన ఇంటి వారు రక్షించబడుటకు మార్గము అయ్యారు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మీరు ఎంత పెద్ద పాపం చేసినా సరే, మీరు ఎంత పెద్ద నేరస్తులు అయినా సరే యేసు ప్రభువా నా పాపములు క్షమించి నన్ను పరిశుద్ద పరచండి అని అడిగినప్పుడు ఆయన మన సమస్త పాపముల నుండి క్షమించి మనలను పరిశుద్ద పరచుటకు సిద్ధంగా ఉన్నారు. మన యొక్క పాపములు కొరకు సిలువలో నలగగొట్టబడ్డారు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ద రక్తం చేత పాపములు అన్నీ కడిగి పవిత్ర పరిచి మనలను నూతన వ్యక్తులుగా మార్చ గలిగేది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. మీరు యేసుక్రీస్తుని అంగీకరించి పాపములనుండి కడగబడి మరణము నుండి భయము లేకుండా నూతన జీవితాన్ని జీవించండి. 

- బ్రదర్. పి.వి.విలియమ్స్.

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణం ఎడిటర్ ను మరియు తోటి సేవకులను విశేష జ్ఞానంతో నింపేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino