By Village Missionary Movement
Sunday, 09-Jan-2022దిన ధ్యానము(Telugu) 09.01.2022 (Kids Special)
ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం.
అంశం:- పొర్లించబడిన రాయి.
"కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు" - మత్తయి 5:7
ఒక రాజు తన ప్రజల యొద్ద కార్యములు తెలుసుకొనుటకు సాధారణ వ్యక్తి వలె వేషం వేసుకొని ఒక పెద్ద రాయిని ప్రజలు అందరు చూసుకొనే లాగా రద్దీగా ఉన్న దారిలో పెట్టారు. దాని క్రింద 100 వెండి నాణెములు మరియు ఒక ఉత్తరం కూడా పెట్టారు. తరువాత ఎవరికి తెలుయకుండా ఏమి జరుగుతుంది అని గమనిస్తూ ఉన్నారు. ఆ మార్గంలో అందరూ నడుస్తూ వెళ్తున్నారు. రాము వస్తూ ఆ దారిలో అడ్డంగా ఉన్న ఆ రాయిని చూసిన వెంటనే కోపం వచ్చేసింది. పన్ను వసూలు చేస్తున్న మంత్రులు ఎవ్వరూ దీనిని పట్టించుకోరు. దారిలో ఇంత పెద్ద రాయి ఉంటే ప్రజలు ఎలా వస్తారు, వెళ్తారు?. జరుగుతున్నది అంత అన్యాయమే అని సణుగుకొని వెళ్లాడు . వేలన్ ఆ మార్గంలో వచ్చారు తొందరగా వస్తున్న వాడి కాలికి ఆ రాయి తగిలింది. వెంటనే వాడికి కోపం వచ్చి ఆ రాయిని మరల తన్ని నా కాలుకు దెబ్బ తగిలేటట్లు చేసావు. ఎవడు బుద్ధి లేకుండా ఈ రాయిని ఇక్కడ వేసాడు బుద్దిలేని వాడు అని కోపంతో తిట్టి ఆ రాయిని మరల తన్ని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తరువాత మణి అనే బాలుడు వచ్చాడు. వాడు కుడా ఆ రాయిని గమనించ కుండా దానిని తన్నుకొని క్రింద పడిపోయాడు. కాని వాడు లేచి దీనిని తన్నుకొని ఎంతంది పడిపోయారో? తెలియదు అని చెప్పి ఇక నా వలన ఎవరు కూడా పడిపోకూడదు. అని ఆ రాయిని తీసి పక్కకు పడేసాడు. దాని క్రింద మెరుస్తూ ఉన్న 100 వెండి నాణెములు అక్కడ కనబడ్డాయి. వాటి మధ్యలో ఒక ఉత్తరం ఉంది. దానిని తెరిచి చూస్తే అందులో ఇలా వ్రాసి ఉంది. ఈ రాయిని తీసి పక్కన పడేసే వ్యక్తికి ఈ 100 వెండి నాణెములు బహుమానం అని వ్రాసి ఉంది. మణి వాటిని తీసుకొని సంతోషంగా వాటిని చూస్తువున్న దానిని ఆ దేశపు రాజు గమనించి వాడిని పొగుడుతూ తన ప్రణాళికను చెప్పారు. మణి ఆ 100 వెండి నాణెములను తీసుకొని సంతోషంగా వెళ్ళాడు.
ప్రియ తమ్ముడు, చెల్లి రాము మరియు వేలన్ వలె కోపపడితే మనం ఏదియు సాదించలేము. నొప్పి మాత్రమే మిగులుతుంది. ఇతరులు ఇబ్బంది పడకూడదు అని మణి ఆ రాయిని పొర్లించాడు కాబట్టి కనికరము కలిగిన వాడు కనికరము పొందుకున్నాడు. కోపం లేకుండా ప్రశాంతంగా ఉండిన యెడల జ్ఞానముతో మనము పని చేయగలము.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250