By Village Missionary Movement
Tuesday, 11-Jan-2022దిన ధ్యానము(Telugu) 11.01.2022
అంశం:- చక్కగా చేస్తున్న దేవుడు.
"దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు;” - ప్రసంగి 3: 11
ఒక గ్రామంలో గల పొలం వైపు ఒకాయన నడుస్తు వెళ్తున్నాడు. అప్పుడు గుమ్మడి కాయ తోటలో పెద్ద పెద్ద గుమ్మడి కాయలు కాసి నెలపైన ఉండుట చూసిన ఆయన ఏమిటి దేవుని సృష్టి బలముగా నిలబడలేని ఈ మొక్కలకు ఇంత పెద్ద గుమ్మడి కాయలను చేసి యున్నారు అని సణుగుకొన్నాడు. ఇలా ఆలోచిస్తూ నడుస్తూ వెళ్తూ ఎండ అధికముగా ఉన్నప్పుడు అలసట వలన పక్కనే ఉన్న మర్రి చెట్టు నీడలో పడుకున్నాడు. కొంత సమయం తరువాత ఆ మర్రి చెట్టు నుండి చిన్న మర్రి పండు ఒకటి ఆయన తల మీద పడింది. అయ్యో గుమ్మడి కాయ నా తలమీద పడిందో ఏమిటి అంటూ కేక వేస్తూ లెచి చుస్తే అది ఒక చిన్న మర్రి పండు. అప్పుడు ఆయన ప్రభువా గుమ్మడి కాయ ఈ మర్రి చెట్టుకు తగిలించకుండా ఉండినందుకు వందనములు. ఒకవేళ మీరు అలా పెట్టి ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదు అని అనుకున్నాడు. జ్ఞానము గల మీ కార్యముకు వందనములు అని చెప్పాడు.
పరిశుద్ద బైబిల్లో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకు యొక్క వివాహం కొరకు తన పనివాడికి కొన్ని కార్యములు నేర్పించి పంపించారు. ఆ పనివాడు కూడా తన యజమానుడైన అబ్రాహాము నేర్పించినట్లుగా ఇస్సాకునకు అమ్మాయిని చూచుటకు వెళ్తున్నాడు. ఇది ఒక పక్క మరి రెండవ పక్క ఇస్సాకు దేవుని గూర్చిన కార్యములు ధ్యానించుటకు పొలము వైపు వెళ్ళాడు. ఇలా ఎలియాజరు ఒక పక్క ఇస్సాకు ఒక పక్క దేవుని కార్యములు పైన తమ మనస్సును కేంద్రీకృతం చేసుకున్నారు. అందుకు దేవుడు కార్యములు ఎలా చేసాడో చూడండి. అబ్రాహాము పనివాడికి నేర్పించిన ప్రకారం ఆ అమ్మాయిని తనతో తీసుకొని వెళ్తున్న సమయంలో ఆ సేవకుడు చెబుతున్న మాట నన్ను సరైన మార్గంలో నడిపించిన దేవుడైన యెహోవాను స్తుతిస్తున్నాను అని చెబుతున్నాడు.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మన ప్రభువు సమస్తాన్ని చక్కగాను సరైన మార్గంలోను చేస్తున్న దేవుడు. మన శరీరంలో అవయవాలు చక్కగా సృష్టించి యున్నారు. మన కుటుంబం జీవితం కావచ్చు, మన పిల్లల చదువు కావచ్చు, భవిష్యత్తు, వివాహము, వ్యాపారం అని సమస్తాన్ని ఇచ్చిన దేవుడే ఆయన పనులు చేయుటకు బలాన్ని కూడా ఇచ్చియున్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ప్రతి దినము మమ్మల్ని చక్కగా నడిపించండి ప్రభువా అని ప్రార్ధించి కృతజ్ఞతలు చెల్లించి ఆయన మార్గంలో నడుద్దాం.
- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్.
ప్రార్ధనా అంశం:-
మీడియా పరిచర్యకు అనుభవం గల సమర్పించబడిన సేవకులు దొరికేటట్లు ప్రార్దిద్ధాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250