By Village Missionary Movement
Tuesday, 11-Jan-2022దిన ధ్యానము(Telugu) 12.01.2022
అంశం:- కాపాడే హస్తములు.
"ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు" - కీర్తనలు 50:15
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మయన్మార్ దేశంలో ఆకాశం నుండి విమానాలు దాడి చేస్తున్నాయి. అక్కడనుండి పడుతున్న బాంబులు నుండి తప్పించు కొనుటకు ఐరావతి నది ఒడ్డున అనేకులు కూర్చొని ప్రభువు వైపు చూసి ఏడుస్తున్నారు. ఆ గుంపులో 9 సంవత్సరాలు గల గ్రేసి కూడా ఉంది. యేసు యేసు అని ఏడుస్తుంది. రంగున్ పట్టణములో జీవించిన గ్రేసి యొక్క కుటుంబము రంగున్ నాశనం అయిపోతుంది అని తలంచి ఇంటిని మరియు రైస్ మిల్ ను విడిచి పెట్టి బౌటో గ్రామానికి వచ్చారు. గ్రేసి కొన్ని సామాన్లు కొనుటకు పక్క ఇంటి మామ్మతో పశుమందన్ అనే ఊరికి వచ్చింది. రైస్ మిల్ చూచి వచ్చుటకు వెళ్లిన గ్రేసి తాత అబ్రాహాము, నాన్న ఐసాక్, తమ్ముడు సెల్వ రాజు రంగున్ వెళ్లి యున్నారు. హఠాత్తుగా యుద్ధం ప్రారంభం అయ్యింది. తాతయ్యాను, నాన్నను, తమ్ముడ్ని గుర్తుచేసుకొని గ్రేసి ఏడుస్తూ ప్రార్ధించింది. యుద్ధం ఆగిపోయింది అని అలారమ్ మ్రోగింది. నది ఒడ్డునుండి అందరూ పరిగెత్తుకొని వారి వారి ఇంటికి చేరుకున్నారు. తల్లి అయిన జయకుమారి పరిగెత్తుకొని వచ్చి గ్రేసిని కౌగలించుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పింది. కొంత సమయం తరువాత గ్రేసి యొక్క తాతయ్య, నాన్న, తమ్ముడు ముగ్గురు కూడా ఇంటికి వచ్చేసారు.
గ్రేసి యొక్క నాన్న దేవుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పాడు. విధి చివరికి వచ్చేసరికి యుద్ధం ప్రారంభం అయ్యింది. మేము మరియు మతోపాటు కొందరు మెట్లు పైన నిలబడి యున్నాము. ఎదురుగా ఉన్న దుకాణంలో ఉన్న వారిని మిలటరీ వారు మిషన్ గన్ తో వరుసగా కాల్చేసారు. ఒక్క సరిగా అందరూ గోల పెట్టడం ప్రారంభించారు. అప్పుడు సెల్వరాజ్ ఇక్కడ యేసయ్య ఉన్నారు ఆయన మమ్మల్ని కాపాడతారు అని కేక వేస్తూ చెప్పాడు. మా చుట్టూ పక్కల భయంతో ఉన్నవారు అందరూ నిరీక్షణతో మమ్మల్ని చూసారు. ఒక వేళ యుద్ధం కొనసాగించి యుంటే మేము కూడా ఆ తూటాలకు బలి అయ్యి ఉండే వాళ్ళము. అందరమూ మొకరించి దేవాది దేవునికి స్తోత్రం చెల్లించాము. ప్రార్ధనే మనకు జయాన్ని ఇస్తుంది మరియు దేవుడే మనకు కోట అయ్యి ఉన్నారు.
అవును ప్రియమైన వారలారా! అపత్కాలమందు ఆయనే అనుకూలమైన సహాయకుడిగా ఉన్నారు. అవసరతలో మాత్రమే కాదు ప్రతి క్షణం ఆయనే మన కోట ఆయనను దాగు చోటుగా చేసు కున్న మనము ధన్యులము. కాబట్టి పరిస్థితులను చూసి కలత చెందకుండా దేవున్ని నమ్మి ధైర్యముగా ఉండండి.
- శ్రీమతి. వనజా పాల్ రాజ్.
ప్రార్ధన అంశం:-
మీడియా పరిచర్యలో ప్రతి నెల కార్యక్రమల కొరకు మనం చెల్లించ వలసిన ధన సహాయం కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250