By Village Missionary Movement
Friday, 14-Jan-2022దిన ధ్యానము(Telugu) 14.01.2022
అంశం:- యుద్దామా లేక మంచమా?
"విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి" - 1తిమోతికి 6:12
ఊరియా ఒక మంచి యోధుడు. సైన్యంలో ఉన్న ఏ యోధుడనైన పిలిచి నీవు వెళ్లి నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండు అని చెప్పిన యెడల ఎవరైనా వెళ్లుటకు జంకుతారా? లేనేలేదు. ఇశ్రాయేలీయుల శ్రేష్ఠమైన రాజుగా ఉండిన దావీదు కాలంలో ఊరియా అనే యుద్ధ యోధుడకు అలాంటి ఆజ్ఞ ఇవ్వబడింది. ఊరియాను రాజే పిలిచి తన ఇంటికి వెళ్లుటకు ప్రోత్సహించారు. కాని ఊరియా అయితే ఇంటికి వెళ్లుటకు తిరస్కరించాడు. ఇలాగు వ్యత్యాసంగా నడుచుకొన్న కారణాన్ని అడిగినప్పుడు దేవుని యొక్క మందసము, ఇశ్రాయేలీయుల సైన్యం యుద్ధములో ఉండినప్పుడు తినుటకు త్రాగుటకు నా కుటుంబముతో సంతోషించుటకు నేను ఇంటికి వెళ్ళాలా అని ఊరియా పౌరుషముతో చెప్పాడు.
ఒక సాధారణ యోధుడైన ఊరియా తన దేవుని మీద మరియు తన రాజు మీద పెట్టుకున్న బాధ్యతను చూడండి. తన దేశ ప్రజల కొరకు యుద్ధములో నిలబడుట కంటే నా సంతోషం ప్రాముఖ్యం కాదు అని చెబుతున్నాడు. ఇలాంటి పౌరుషము గల ఒక యోధుని యొక్క ప్రాణం అన్యాయముగా పోయింది. బాధ్యతను నెరవేర్చ వలసిన దావీదు యుద్ధంలో ఉండకుండా నిద్రలో ఉండుట వలన పాపములు, శాపములు పెరిగి పోతున్నాయి. ఆ దినము గొలియాతును జయించిన దావీదు ఎక్కడ? ఇక్కడ బెర్షెబాను జయించలేక తడబడుతున్నాడు. దావీదునకు ప్రారంభంలో ఉండిన ధైర్యము మరియు పౌరుషము ఎక్కడకు వెళ్ళింది. అయ్యో యుద్ధంలో యుద్ధభూమిలో ఊరియా మంచంపై దావీదు ఎంత దుఃఖకరం.
స్నేహితులారా! ఈ దినము కూడా దేవుని కొరకు పని చెయ్యవలసిన మనము మన బాధ్యతలను మరచిపోయి నిద్రలో జారుకుంటున్నామా? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఆలోచిద్దాం. మోకాళ్లను దేవుని కొరకు వంచి విజయము అనే పదమును వచ్చేవరకు జీవితంలో ముందుకు వెళ్తూ ఉందాం మరియు లేచి దేవుని సన్నిధిలో వేచి ఉందాం. విశ్వాస యుద్ధమును చేపడదాం. నిరుత్సాహములను, బలహీనతలను, కష్టనష్టములను జయించి దేవుని కొరకు జీవిద్దాం.
- శ్రీమతి. రూత్ అనీష్
ప్రార్ధన అంశం:-
ప్రార్ధనా మిషనరీగా మనతో కలిసి ఉన్న ప్రతి ఒక్కరినీ కూడా దేవుడు ప్రార్ధనా ఆత్మతో నింపేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250