By Village Missionary Movement
Friday, 14-Jan-2022దిన ధ్యానము(Telugu) 15.01.2022
అంశం:- గురి తప్పదు.
"దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" - రోమీయులకు 8:28
కుష్టు రోగుల మధ్యలో దేవుని ప్రేమను ఎవరు చెప్పడానికి వెళ్తారు అని పిలుపు వచ్చినప్పుడు ఒక యవ్వనస్తుడు తన చేతులు ఎత్తి ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చిన యవ్వనస్తుడ్ని పరిచర్యకు పంపించారు. కానీ ఎవ్వరు ఆ యవ్వనస్తుడ్ని అంగీకరించలేదు. దేవుని ప్రేమను తిరస్కరించారు. 10 సంవత్సరాలు తరువాత ఏ ఒక్కరు కూడా దేవుని ప్రేమను అంగీకరించలేదే అని ఆలోచించి ఓడ ఎక్కి తన సొంత దేశానికి తిరిగి వెళ్లుటకు నిర్ణయించుకున్నారు. ఓడ ఎక్కినప్పుడు ఆ నావికుడు ఆయనను చూసి మీ ముఖమునకు, చేతులకు కుష్టు రోగము వచ్చింది కదా అని అన్నారు. ఆయన కన్నీటితో ఈ నావికుడు నన్ను తిరస్కరించాడు అని నా ఊరిలో ఉన్నవారు నన్ను అంగీకరిస్తారు అనుకుంటే వాళ్ళు కూడా తిరస్కరిస్తారు అని బాధపడి కన్నీరు కార్చారు. దానిని విన్న ఒకడు పరిగెత్తుకొని వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళకు చెప్పారు. ఊర్లో ఉన్న అందరూ గంపుగా కూడి ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చి మీకు కూడా కుష్టు రోగము వచ్చిందా అని అడిగారు. ఆయన వెంటనే దానిని మరిచి దేవుని ప్రేమను అందరికి చెప్పాడు. ఆ గ్రామము అంతా ప్రభువుని అంగీకరించింది.
పౌలు ఖైదీగా ఉన్నప్పుడు యెరూషలేము నుండి రొమాకు నావ ద్వారా తీసుకొని వెళ్ళబడ్డాడు. తుఫానుతో కూడిన వర్షం వలన మెలిత అనే ధీవికి వాళ్ళు చేరుకున్నారు. అప్పుడు ఆ దీవి ప్రజలు చలి కాచుకొనుటకు అగ్ని ముట్టించి ప్రేమతో వాళ్ళను చేర్చుకున్నారు. పౌలు అగ్నిలో వేయడానికి కర్రను తీసినప్పుడు ఒక పాము అతని చేతికి కరిచింది. వెంటనే ఆ దీవి ప్రజలు పౌలు కచ్చితంగా నేరస్తుడే ఈయన సముద్ర ప్రమాదం నుండి తప్పించబడినను ఈయన పాపము ఈయనను వెంటాడుతోంది అని మాట్లాడుకున్నారు. పౌలు ఆ పామును వదిలించుకొని తన పనిని కొనసాగిస్తున్నాడు. ఇతను ఇంకా కొంత సేపటిలో మరణిస్తాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ పౌలు అయితే మరణించిలేదు. దానిని చూసిన ఆ దీవి నాయకుడు పౌలును పిలిచి మూడు దినములు తనతో ఉంచు కొని దేవుని ప్రేమ గురించి తెలుసు కొంటున్నారు. ఆ దీవి ప్రజలు దేవుని ప్రేమను రుచి చూచుటకు దేవుడు అతనిని వాడుకున్నారు.
దేవుని పిల్లలారా! మీ కొరకు అనేక మంది అనేక విధములుగా మాట్లాడే దానిని విని మీ జీవితంలో జరుగుతున్న దానిని చూచి నిరుత్సాహ పడిపోయి ఉన్నారా? సోలిపోకండి దేవుడు సమస్తాన్ని మేలు కొరకే చేస్తారు. దేవుని నామ మహిమ కొరకు కొన్నింటిని అనుమతిస్తున్నారు. ఆయన మీ జీవితంలో మీరు అనుభవించే కార్యములు అన్నీ కూడా మీ మేలు కొరకే అని మరువకండి. మీరు చూచి నప్పుడు చిన్న కష్టములు కూడా మిమ్మల్ని నిరుత్సాహ పరచగలదు. ఆ కార్యములు మీ జీవితంలో గొప్ప మేలును తీసుకు వస్తుంది అన్నది నిశ్చయము. కుష్టు రోగి అయిన ఆ యవ్వనస్తుడు ఇతరులు తనని తిరస్కరించినప్పటికి మానసిక ఒత్తిడికి గురి కాకుండా తనను వెతికి వచ్చిన గ్రామ ప్రజలకు దేవుని ప్రేమను ప్రకటించాడు. తనను ఆశ్రద్ద చేసి మాట్లాడిన ప్రజల గురించి పౌలు చింతించ కుండా దేవుని రాజ్య విస్తరణలో దృఢమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగాడు. మరి మనయొక్క గురి ఎలా ఉంది? వెనక్కి వెళ్లాడమా? లేక ముందుకు వెళ్లాడమా? ముందుకు వెళ్తుంటే కచ్చితంగా మీరుకుడా దేవుని రాజ్య విస్తరణలో వాడబడతారు.ఆమెన్.
- బ్రదర్. సంతన పాండి
ప్రార్ధనా అంశం:-
7000 మంది మిషనరీల ద్వారా ఒక లక్ష గ్రామాలు దర్శించుటకు చేస్తున్న మన ప్రయాసలో దేవుని హస్తం తోడుగా ఉండేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250