Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.01.2022
Share:

By Village Missionary Movement

Thursday, 20-Jan-2022

దిన ధ్యానము(Telugu) 21.01.2022

 

అంశం:- పొదుపు చేయబడిన కన్నీరు.

 

"...నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా" - కీర్తనలు 56:8

 

ఒక కుటుంబంలో ఒక తల్లిగారు అనేక కష్టములను అనుభవించి వచ్చారు. భర్త దగ్గర దెబ్బలు కాస్తూ దొరికిన పనికి వెళ్లి తన ఇద్దరు కుమారులను సహనముతో అన్నింటినీ సహించుకొని రోజు కన్నీరు కారుస్తూ ప్రార్ధించి వాళ్ళను పెంచారు. ఇలా చాలా సంవత్సరాలు ప్రార్ధించారు. అయినా గాని ఆ తల్లిగారు నిరుత్సాహ పడిపోకుండా ప్రార్ధించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ తల్లిగారు యొక్క ప్రార్ధనకు జవాబు దొరికింది. ఆమె కార్చిన కన్నీరుకు జవాబు వచ్చింది. ఆమె యొక్క ఇద్దరు కుమారుల యొక్క భవిష్యత్తు చాలా చక్కగా మారింది. భర్త కూడా మారుమానస్సు పొందారు. వారి యొక్క సంతోషమునకు కారణము దేవుడు వారి యొక్క కన్నీటి ప్రార్ధనను లెక్కల్లో (పొదుపులో) పెట్టుకొని యున్నారు. సరైన సమయానికి జవాబు ఇచ్చారు. 

 

బైబిల్లో కూడా దేవుడు దావీదును చంపినప్పుడు ప్రజలు సౌలు చంపినది వేల కొలది దావీదు చంపినది పది వేల కొలది అని పొగుడుతున్న దానిని తట్టుకోలేక దావీదును చంపుటకు ప్రయత్నం చేస్తున్నాడు. గొలియాతును చంపినందుకు తన కుమార్తెను ప్రజల మధ్యలో మాట ఇచ్చిన దాని బట్టి వివాహం చేసినప్పటికీ అడవికి, కొండకు దావీదు తనను కాపాడుకొనుటకు సౌలుకు భయపడి పారిపోతున్నాడు. అప్పుడు అనేక సార్లు దావీదు కన్నీరు కార్చి దావీదు ప్రార్ధించాడు. కాబట్టి నా ప్రయాస అంతా దేవుడు ఎరిగి యున్నారు. నా కన్నీటి బాష్ప బిందువులు మీరు దాచారు అవి మీ లెక్కల్లో ఉన్నాయి కదా అని దావీదు చెబుతున్నాడు. అలాగే కన్నీరు లెక్కల్లో ఉంచబడి నందున దావీదు తగిన సమయం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదు హెచ్చింప బడ్డాడు. దేవుని దృష్టికి మరుగైనది ఏది లేదు. 

 

దీనిని చదువుతున్న స్నేహితులారా! మీరు కూడా అనేక దినాలు ఒక కార్యం కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నారా? నేను కన్నీరు కార్చినను ఎలాంటి ప్రయోజనం లేదు అని బాధపడుతున్నారా? ఎన్నడు మీ కన్నీరు వ్యర్థం కాదు. అవి పరలోకపు లెక్కల్లో వ్రాయబడ్డాయి. దానికి కచ్చితంగా ఫలితం ఉంటుంది. దేవుడు దేనిని కూడా అప్పుగా ఉంచుకోరు. తగిన సమయంలో ఫలాన్ని ఇస్తారు. నిరుత్సాహ పడిపోకుండా ఇంకనూ ప్రార్ధనా చెయ్యండి జయము ఖచ్చితంగా వస్తుంది. 

- బ్రదర్. ఎస్. కాలేబ్ రాజా

 

ప్రార్ధనా అంశం:-

నూతన సంవత్సరంలో మనతో కలిసి పరిచర్య చేస్తున్న పార్టనర్ షిప్ మిషనరీలను దేవుడు బలముగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet radissonbet nesinecasino betbey cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş https://tr.holiganbet-30temmuz.art/