Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.01.2022
Share:

By Village Missionary Movement

Thursday, 27-Jan-2022

దిన ధ్యానము(Telugu) 27.01.2022

 

అంశం:- నిరీక్షణ కలిగి ఉండుడి

 

"కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును” - హెబ్రీయులకు 10:35

 

మీ పని ఈ దేవాలయమునకు సరిపోయినంతగా లేదు ఈ సంవత్సరం అంతా ఈ సంఘమునకు దొరికిన ఫలితము బారెడు మాత్రమే దయచేసి ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ తీసుకొని వేరే ఎక్కడికైనా వెళ్ళండి అని అన్నారు ఆ సంఘ పెద్దలు. ఈ మాటలు ఆ వృద్ధాప్యంలో ఉన్న భోధకునికి మిక్కిలి వేదన కలిగించింది. సంఘంలో నుండి సంపూర్ణంగా వెళ్ళి పోవుటకు నిర్ణయించుకున్నారు ఆ బోధకుడు. అక్కడ తన యొక్క చివరి ఆరాధనలో ఒక బాలుడు భోదకుని యొద్దకు వచ్చి నేను కూడా పెద్దవాడినైన తరువాత మీ లాగా ఒక బోధకుడిగా రాగలనా? అని అడిగాడు. కళ్ళు అంతా కన్నీళ్ళతో నిండిన బోధకుడు ఆ బాబు తల మీద చేతులుంచి అవును తమ్ముడు నువ్వు కూడా గొప్ప సేవకునిగా వస్తావు అన్నారు. 

 

సంవత్సరాలు గతించిన తరువాత ఆఫ్రికాలో కఠినమైన ప్రజల మధ్యలో గొప్పగా పరిచర్య చేసిన మిషనరీ లండన్ తిరుగు ప్రయాణం అవుతున్నారు అని ప్రజలు విని విస్తారమైన ప్రజలు మిక్కిలి సంతోషంతో ఆ మిషనరీని ఆహ్వానించుటకు గుమికూడి ఉన్నారు. అది ఎవరు అంటే నేను ఒక బోధకుడిగా మీ వలె మార గలన అని ప్రశ్న వేసిన ఆ చిన్న బాలుడే. అవును ఆయన రాబర్ట్ మొఫెట్ అనే ప్రఖ్యాతి గాంచిన సేవకుడు. ఆ సేవకుడ్ని ఆహ్వానించుటకు లండన్ మహా నగరమే ఎదురు చూస్తూ నిలబడింది. 

 

నా యొక్క పరిచర్యలో కూడా క్రైస్తవ జీవితంలో విస్తారమైన సంఖ్యలో ప్రజలు రాలేదు. ప్రజల్లో మార్పు లేదు అని నిరుత్సాహ పడిపోవద్దు. ప్రభువు నందు పడుతున్న ఏ ప్రయాస కూడా వ్యర్థము కాదు అని గ్రహించిన వాళ్ళుగా, స్థిరులను, కదలని వారును ప్రభువు కార్య అభివృద్ధి యందు ఎప్పటికి ఆశక్తితో ఉండుడి (1కోరిందీ 10:58) అని బైబిల్ చెబుతుంది. 

 

పైన మనం చదివిన లేఖన భాగంలో మిక్కిలి ఫలితం ఇస్తున్న మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి అని చదువుతున్నాం. సంవత్సరం యొక్క ప్రారంభంలో ఉంటున్న మన ప్రతి ఒక్కరికి క్రీస్తు నందు మనం మన నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసం ఉంచాలి. 

 

నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు అని హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10: 38 లో చెబుతున్నారు. మనం చెడిపోవుటకు వెనక్కు వెళ్లిపోకుండా ఆత్మల సంపాదన కొరకు విశ్వాసం కలిగి ఉందాం. ప్రభువు మనలను నడిపించును గాక!. ఆమెన్.

- బ్రదర్. పి.జాకబ్ శంకర్

 

ప్రార్ధనా అంశం:-

12 మంది మిషనరీల ద్వారా ఆయా ప్రాంతాల్లో సమర్పించబడిన 500 మంది మిషనరీలు ఈ నూతన సంవత్సరంలో దేవుడు తయారు చేసేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş holiganbet giriş çarkbet çarkbet giriş