Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.02.2022
Share:

By Village Missionary Movement

Monday, 31-Jan-2022

దిన ధ్యానము(Telugu) 01.02.2022

 

అంశం:- మాట్లాడుతున్న వృక్షము.

 

"మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము" - ఎఫెసీయులకు 2:10

 

నేను వృక్షమును మాట్లాడుతున్నాను. శూరు అనే కఠోరమైన అరణ్యములో ఉన్నాను. వర్షాన్ని చూసి అనేక సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ చూసినా ఎండిపోయిన పరిస్థితులే కనబడుతున్నాయి. ఎండ యొక్క తీవ్రత నన్ను కాల్చివేసింది. పచ్చిక ఎంత మాత్రము నాలో లేదు అని అంగలార్చుతున్న సమయంలో ఇంకా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నో పచ్చిక గల ప్రాంతాలు, నీళ్లు గల ప్రాంతాలు అందమైన స్థలాలు వీటన్నింటినీ దేవుడు చేసియుండగా దేవుడు నన్ను మాత్రమే ఎందుకు ఈ అరణ్యంలో పెట్టారు. జీవితంలో నాకు సంతోషం లేదే. ఇతరులకు నా వలన ఎటువంటి ప్రయోజనం లేదే అనే ఆలోచన రోజు నాకు వస్తుండేది. 

 

ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు హఠాత్తుగా చాలా మంది ప్రజలు నా దగ్గరకు రావడం నేను చూసాను. నా జీవితంలో మొట్టమొదటిగా ఇంత పెద్ద జనసమూహాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. వారు మాట్లాడుతున్న స్వరం నా చెవిలో పడింది. చా ఈ నీళ్లు ఎంత చేదుగా ఉన్నాయి వీటిని మనం ఎలా త్రాగగలం అని సణుగుకొన్నారు. ఇలా మాట్లాడుతూ ఆ ప్రకాశ వంతమైన వ్యక్తితో వాళ్ళు వాదిస్తున్నారు. కర్ర పట్టుకొని ఆ వ్యక్తి నిలబడి యున్నారు. తరువాత నేను అర్ధం చేసుకున్నాను ఆ వ్యక్తి పేరు మోషే. అప్పడు ఆ మోషేకు దేవుడు నన్ను చూపించారు. నన్ను నరికి ఆ నీటిలో నన్ను వేయమని చెప్పిన వెంటనే వారు అలానే నన్ను నరికి ఆ నీటిలో వేయగా ఆ చేదుగా ఉన్న నీరు మధురంగా మారింది. ఎంత ఆశ్చర్యం. జీవితంలో ప్రశ్నార్ధకంగా ఉన్న నేను కూడా మూడు దినములు నీళ్లు లేక అరణ్యంలో ఇబ్బంది పడుతున్న 6 లక్షల మందికి పైబడిన ఇశ్రాయేలీయుల ప్రజలకు దాహం తీర్చుటకు కారణం అయ్యానే అని ఎన్నో సంవత్సరాలు సంతోషించాను. తరువాత నాకు ఇలాంటి కార్యం జరగబోతుంది అని దేవుడు నన్ను ముందే ఆ స్థలములో పెట్టారు అని తలంచి ఆశ్చర్యపోయాను. అరణ్యంలో ఎవరు నన్ను పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని ప్రణాళికలో ఉండి ఉన్నాను అని తలంచినప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నా పేరు కూడా లేని నన్ను పరిశుద్ద గ్రంధంలో వ్రాసి పెట్టారు.

 

ప్రియమైన స్నేహితులారా! మీయొక్క జీవితంలో కూడా ఇలాంటి తల్లిదండ్రులు నాకు ఉన్నారే, నేను అందంగా లేనే, నేను చదువుకోలేదే, మంచి కుటుంబ పరిస్థితి లేదు, నాకు పని లేదే అని అనేక ప్రశ్నలతో ఉన్నారా? చింతించకండి. ఒక వృక్షముగా ఉన్న నన్ను ఎలా దీవెన కరంగా మార్చరో అలానే మనుష్యులుగా ఉన్న మిమ్మల్ని కూడా నా కంటే విశిష్టమైన వారిగా చేసి యున్నారు. మీకు సహాయం చేయుట యేసయ్యకు చాలా సులువు. నేను దీవించబడుటకు ఎలా అయితే వేచియున్నానో అలానే మీరు కూడా దీవెనలు పొందుకొనుటకు సహనం కలిగి ఉండండి. తగిన కాలమందు యేసయ్య మిమ్మల్ని హెచ్చించుట నిశ్చయం.

- బ్రదర్. కె.డేవిడ్ గణేషన్.

 

 

ప్రార్ధనా అంశం:-

ఈ నెల అంతా జరగబోతున్న పరిచర్యలో దేవుని హస్తం తోడుగా ఉండేటట్లు ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet