Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Saturday, 05-Feb-2022

దిన ధ్యానము(Telugu) 05.02.2022 (God’s creation’s special)

 

అంశం:- అరుదైనది.

 

"అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును" - సామెతలు 31:30

 

సముద్రంలో నులివెచ్చని ప్రాంతంలో నేను పుట్టి పెరుగుతాను. నేను తయారయ్యే విధము కొంచం కఠినముగా ఉంటుంది. నన్ను కనుగొనుట అంత సులువు కాదు. అందుకు అంటే తీస్తున్న అన్నీ చిప్పల్లోనూ ( అనగా గుల్లల్లోను) నేను ఉండను. ఇలా నేను తయారయ్యే విధము కఠినమైన ప్రక్రియ. నేను చాలా విలువగా అమ్ముడు పోవడానికి గల కారణం నన్ను సృష్టించిన వాడు నన్ను సృష్టించిన విధము ఆశ్చర్యకరముగా ఉన్నందు వలనే. 

 

ముత్యము అయిన నేను తయారయ్యే విధము కొద్దిగా వివరిస్తాను వినండి. గుల్లల్లో కొన్ని ద్రవాలు ఏర్పడి తరువాత ఇప్పతిలియం అనే రసాయనం వలన నేను రూపించబడి దాంట్లో ఇంకా కొన్ని ద్రవాలు కలిసి నేను ఏర్పడుతున్నాను. ఇది ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు అనేక దినముల ఈ ప్రయాణం జరిగుతుంది. కాని బైబిల్లో స్త్రీ యొక్క గుణము నాకంటే విలువైనదిగా చెప్పబడుతుంది. అంటే అది ఎంత ప్రాముఖ్యంగా దేవుడు చెప్పి ఉంటారో చూడండి. గుణవంతురాలైన స్త్రీని కనుగొను వాడెవడు, ఆమె యొక్క విలువ ముత్యము కంటే విలువైనది. అబ్బో నా కంటే స్త్రీ యొక్క గుణాతిశయము గొప్పదా? ఏంటి ఈ అద్భుతం అని కొన్ని సార్లు నేను అనుకొంటాను. మాలో అనేక విధములైన మరియు అనేక రంగులైన ముత్యాలు ఉన్నట్లే స్త్రీలు కూడా అనేకమైన రంగాల్లో శ్రేష్ఠమైన వారిగా ఉంటున్నారు. చూడండి సామెతలు 31: 10-29 వచనాలు వరకు.

 

ముత్యము కంటే మిమ్మల్ని శ్రేష్ఠమైన వారని దేవుడే చెప్పియున్నారు. స్త్రీలారా మీరు ఎవరు అని మీకు చెప్పాలా? మీరు మీ భర్తల యొక్క నమ్మకాన్ని పొందుకొన్నవారు అతని యొక్క లాభ ప్రాప్తికి వెలితి కలుగదు (సామెతలు 31:11). మీరు బ్రతుకు దినములు అన్నియు మీ భర్తకు మేలు చేయుదురు గాని కీడు చెయ్యరు (సామెతలు 31:12). దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును (సామెతలు 31: 20). మీ ఇంటి వారి మీద శ్రద్ధ కలిగిన వారు (సామెతలు 31: 21). మీరు జ్ఞానము గలవారు కృపగల ఉపదేశమును బోధించెదరు (సామెతలు 31: 26). మీరు రాబోవు కాలము విషయమై నిర్బయముగా ఉండేవారు (సామెతలు 31:25). మీరు చురుకుగా పనిచేసి మీ భోజనము చేయుదురు (సామెతలు 31:27). మీ పిల్లలు లేచి మిమ్మల్ని ధన్యురాలు అని పొగడెదరు (సామెతలు 31:28). 

 

మేము అందమైన వాళ్ళమే, అనేకమైన రంగుల్లో అనేక ఆకారంలో ఉంటాం కాని మా అందం పై పైన ఉన్నది మాత్రమే కాని మీరు అలా కాదు మీరు లోలోపల కూడా అందంగా అనగా దేవునికి భయపడి మీ హృదయములో దాక్కొని ఉన్న గుణము చేత క్రియల చేత అందమైన వారు (సామెతలు 31:30). 

 

స్త్రీలారా! మీ యొక్క గుణాతిశయము విలువకలిగిన ముత్యము కంటే విలువైనది.

- బ్రదర్. పొన్మణి పాల్

 

ప్రార్ధన అంశం:-

ప్రతిదినము ఉదయం 5 గంటలకు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతున్న హీలింగ్ సర్వీస్ లో అనేకులు పాల్గొని స్వస్థత పొందుకొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban holiganbet setrabet marsbahis giriş vaycasino giriş