Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.02.2022 (Kid’s special)
Share:

By Village Missionary Movement

Sunday, 06-Feb-2022

దిన ధ్యానము(Telugu) 06.02.2022 (Kid’s special)

అంశం:- థాంక్స్ చెప్పుట మరువకు

ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం:-

“నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము” - కీర్తనలు 103:2

హాలో పిల్లలు! ఎలా ఉన్నారు. చివరి దినాల్లో అనేక రోగాలు వస్తాయి అని బైబిల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది. అయినప్పటికి మనం ప్రార్ధించిన యెడల మనలను సంరక్షించి మనలను రక్షించుటకు యేసయ్య మనతోనే ఉన్నారు కాబట్టి మనం భయ పడవాల్సిన అవసరం లేదు సరేనా! రండి కధ విందాం.

అందమైన చెట్లుతో నిండిన ఆ అడవిలో పావురము మరియు చీమ స్నేహితులుగా ఉండేవారు. గల గల అని పారుతున్న నది ఒడ్డుకు రోజు పావురం వస్తూ ఉండేది. అలా వచ్చినప్పుడల్లా తన స్నేహితుడైన చీమను చూసి మాట్లాడుతూ ఉండేది. చీమ చురుకుగా ఉండుట ఐక్యంగా ఉండుట చూసి ఆశ్చర్య పోయి ఈ పావురం ఒక ప్రశ్న అడిగింది. మీరు ఎలా ఇలా వుండగలుగు తున్నారు అని. ఒక దినము ఈ చీమ ఆహారం సమకూర్చుటకు వెళ్తున్నప్పుడు కాలు జారి నీటిలో పడిపోయింది. దానిని చూసిన పావురం ఒక ఆకును తీసి నీటిలో వేసింది. అప్పుడు ఆ చీమ దాని మీదకు ఎక్కి ఒడ్డుకు చేరుకుంది. తరువాత ఆ చీమ పావురమునకు థాంక్స్ చెప్పింది. మరియు సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడావు కాబట్టి స్నేహితుడా నీవు చేసిన మేలును ఎప్పటికి మరువను అని చెప్పింది. పిల్లలు మీరు కూడా సహాయం చేసిన వాళ్ళను ఎప్పుడు మర్చిపోకుండా కృతజ్ఞతలు చెబుతారు కదా. వెరీ గుడ్

ఇంకొక దినము పావురము చెట్టు మీద ఉండగా వేటగాడు దానికి గురి పెట్టాడు. అటువైపు వచ్చిన చీమ ఆ వేటగాడు పావురాన్ని గురి పెట్టడం చూసింది. వెంటనే తన స్నేహితులతో కలిసి ఆ వేటగాడు యొక్క కాలును కరవడం ప్రారంభించింది. చీమ కరుస్తుంది అని గట్టిగా అరిచిన వేటగాడి యొక్క స్వరం విన్న పావురం అక్కడ నుండి ఎగిరి వెళ్ళిపోయింది. తనను కాపాడింది చీమ అని ఎరిగి చీమకు కృతజ్ఞతలు చెప్పింది. 

ఏంటి పిల్లలు చీమ మరియు పావురం తమకు సహాయం చేసిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోలేదు. మీ జీవితంలో కూడా యేసయ్య ఎంత మేలు చేసారో ఆలోచించి చూసారా? ప్రతిరోజు మనలను సంరక్షించి, ఆరోగ్యం ఇచ్చి, మన ప్రతి ఆవసరతలు తీర్చి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కూడా యేసయ్యకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకూడదు. చెప్తారా? వెరీ గుడ్.
-    శ్రీమతి. జీవా విజయ్

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino perabet perabet giriş perabet perabet giriş perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş Online casino nz Best payout online casino nz matbet jojobet jojobet giriş jojobet güncel giriş bahsegel bahsegel bahsegel matbet romabet lunabet