Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Monday, 07-Feb-2022

దిన ధ్యానము(Telugu) 07.02.2022 (God’s creation’s special)

అంశం:- నా చిరునామా.

"...ఎవడైనను నన్ను  వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను" - మత్తయి 16:24

రెండువేల సంవత్సరాలకు ముందు ఉన్న నేను ప్రజల చేత ద్వేషించబడే వాడిగా ఉన్నాను. నన్ను చూచిన వారు భయపడతారు. ఇదే నా చిరునామా. నేను ఎవరు అని ఆలోచిస్తున్నారా? రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన కాలంలో వారి యొక్క చట్టమును వ్యతిరేకించిన వారికి హింసించుటకు వాళ్ళ యొక్క కాళ్ళకు చేతులకు మేకులు కొట్టి శరీరం అంతా రక్తం కారేటట్లు చేసి మిక్కిలి క్రూరముగా మరణ శిక్ష విధించుటకు శాపపు చిహ్నం వంటి సిలువే మాట్లాడుతున్నాను. ఎప్పుడు నా యొద్ద రక్తపు మడుగులు, మరణపు ఏడ్పులు వినబడుతుంటాయి. ఇలా నా జీవితం నాకే నచ్చలేదు. దానిని నేను ఆలోచించుకొని భాదపడుతుండేటప్పుడు యేసుక్రీస్తు ఆశించి నన్ను కోరుకొని నన్ను తన భుజం మీద ఎత్తుకున్నారు. అదినము మొదలు కొని శాపపు చిహ్నం అయిన నేను రక్షణ చిహ్నంగా మారిపోయాను. 

ఆయన నన్ను మోసి సిలువలో మరణించే అంతగా ఏ పాపము చెయ్యలేదు. కానీ ప్రజలు అందరి కొరకు సిలువ వేయబడి వారి యొక్క విమోచనకు తనను సమర్పించుకున్నారు. వారి యొక్క పాప భారమును క్రీస్తు , పాపం ఎరుగని పరిశుద్ధునిగా ఉన్నప్పటికీ సిలువ అయిన నా మీద వ్రేలాడుతూ పాపములో బందించబడి ఉన్న తన ప్రజలను విమోచించుటకు మరణము యొక్క అధికారి అయిన సాతానును తన యొక్క సిలువ మరణం చేత పతనం చేసారు. అతిక్రమము చేత దేవున్ని విడిచి దూరముగా ఉన్న నరున్ని తండ్రి- కుమారుడు అనే రక్త బంధంలో మరలా కలుపుటకు ఆయన నన్ను చేతుల్లో పెట్టుకొని నూతన ఒడంబడిక చేసుకున్నారు. అది మాత్రమే కాదు ఆయనను విశ్వసించే వాళ్లకు నా ద్వారా వాళ్ళ యొక్క శాపములను, రోగములు తొలగించారు. ఆయనను వెంబడించుటకు నన్ను కచ్చితంగా మోసి వెంబడించాలి అని చెప్పారు.

కాని ఈ ప్రస్తుత క్రైస్తవులను చూస్తే నాకు చాలా దుఃఖంగా ఉంది. అను దినము ధ్యానించవలసిన నన్ను గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే నన్ను జ్ఞాపకం చేసు కుంటున్నారు. గోపురం మీద నన్ను పెట్టి తమ జీవితాల్లో అణిచి పెట్టి మరచిపోతున్నారు. నన్ను తమ మెడలో మరియు చైన్ లోను నన్ను మోస్తే చాలు అని ఆలోచిస్తున్నారు. కాని నా కొరకు మరణించుటకు తమ మెడను ఇచ్చేవారే క్రైస్తవులు అని గ్రహించడం లేదు. 

ప్రియమైన వారలారా! మీరు యేసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా మారి ఆయన అడుగుజాడలను  వెంబడించాలి అంటే నన్ను కచ్చితంగా మోయాలి. అనుదినము నన్ను ఆయన బలముతో మోస్తూ వెళ్ళండి మీ జీవితానికి నేను భారముతో కాదు సులువుగానే ఉంటాను. నా చిరునామా ఇచ్చేసాను. దారి తప్పిపోకుండా సిలువను మోసి వచ్చిన యెడల నిత్యజీవము లోనికి అడుగుపెడతారు.
-    బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్

ప్రార్ధనా అంశం:-
యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న గ్రామీణ సమయము అనే కార్యక్రమాన్ని అనేకులు చూసి ఆశీర్వదించబడేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet