By Village Missionary Movement
Thursday, 24-Feb-2022దిన ధ్యానము(Telugu) 24.02.2022 (God’s creation’s special)
అంశం:- ఆకాశ పుష్పము.
"బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు" - దానియేలు 12:3
సముద్రములో ఇసుకను లెక్కపెట్టగలమా? తల వెంట్రుకలను లెక్కించగలమా? లేదా ఆకాశ నక్షత్రములు లెక్కించగలమా? చెప్పలేము కదా. శాస్త్రవేత్తల దృష్టికి విచిత్రమైన నక్షత్రంగా ఉన్న నేను మీతో ఈ రోజు మాట్లాడాలి అనుకొంటున్నాను. ప్రపంచం సృష్టించబడకమునుపు సర్వశక్తి మంతుడైన దేవుని ద్వారా నేను సృజించబడ్డాను. నన్ను సృజించిన దేవుడు నన్ను చూసి మంచిది అని అన్నారు. నాకు ఏమి అర్థం కాలేదు. నాలో ఏ ప్రత్యేకత ఉంది నన్ను చూసి మంచిది అన్నారు? నాలో ఏ ప్రత్యేకత ఉంది అని నన్ను నేను పరీక్షించుకొన్నాను. కాంతి ప్రకాశించే టటువంటి అద్బుతమైన వెలుగు ఉన్నది అని నేను గ్రహించాను. ఆ వెలుగు మిక్కిలి ప్రకాష వంతముగా ఉన్నది. అది మాత్రమే కాదు నా యొక్క వెలుగు భూమిపై ఉన్న మీపైన ప్రకాశించింది. ప్రభువు పరిశుద్ద గ్రంధంలో నా గురించి చాలా చోట్ల వ్రాయించి ఉంచిన దానిని నేను చూసి సంతోష పడ్డాను. పరిశుద్ద గ్రంధం తన సేవకులను నక్షత్రాలతో పోల్చి మాట్లాడుతుంది. ఆత్మల ఆదాయం చేసేవారు నా వలె పరలోకంలో సదాకాలము శాశ్వతంగా ప్రకాశిస్తారు అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది. ఈ విధంగా ఇంకా చాలా చెప్పవచ్చు. పరిశుద్ద గ్రంధం మీరు బాగా ధ్యానించారు ఆంటే నా గురించి మీరు బాగా తెలుసుకోవచ్చు. ఇఫ్యూ అనే ఆంగ్ల పద్యంలో దాని యొక్క ఉపాధ్యాయుడు చెప్పిన దానిని విందాం.
ఒక రాత్రి నేను దేవుని దర్శనాన్ని చూసాను నా తల పైన కిరీటం ఉంది దానికి చాలా నక్షత్రాలు కలవు. ఇంకా పరలోకంలో ఒక నది తీరంలో కూర్చొని ఉన్నాను. అప్పడు నా వెనుక నుండి ఒకాయన వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పారు. మీరు ఎవరు అని నేను ఆయనను అడిగాను. మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుటకు అవకాశం లేదు. కాని ఈ రోజు నేను పరలోకంలో ఉండుటకు గల కారణం మీరు నాకు చెప్పిన సువార్తయే నేను పరలోకం వచ్చుటకు కారణం అయ్యింది అందుకే మీకు నా కృతజ్ఞతలు అన్నారు. ఆ తరువాత ఇదేవిధంగా అనేకులు నా యొద్దకు వచ్చి కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడే నేను ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాను. యేసయ్య కొరకు భూమి మీద నేను చేసిన ఆత్మల ఆదాయం పరలోకంలో అది నాకు ఫలితంగా, కిరీటంలో కనిపించే నక్షత్రం వలె కనిపించింది.ఇది ఇఫ్యూ అనే ఆంగ్ల పద్యం యొక్క ఒక భాగం. లోకము మరియు లోకంలో ఉన్న సమస్తము ఒక రోజు నశించిపోవును కాని నక్షత్రం అయిన నేను పరలోకంలో ఎప్పటికి మీతో కూడా ఉంటాను. మీరు ఆత్మలను ఆదాయం చేసేవారిగా ఉన్నట్లు అయితే నన్ను పొందుకుంటారు. ప్రభువే మిమ్మును నడిపించును గాక! ఆమెన్.
- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు
ప్రార్ధనా అంశం:-
చైన్ సేవకు అంకితమైన సేవకులు మేల్కొనేలా ప్రార్థిద్దాం.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250