By Village Missionary Movement
Saturday, 26-Feb-2022దిన ధ్యానము(Telugu) 26.02.2022 (God’s creation’s special)
అంశం:- న్యాయదిపతి యొక్క రథం.
"ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా" – 1 సమూయేలు 15:22
సాధారణముగా ఊరి మీద తిరగడం అక్కడకు ఇక్కడకు పరిగెత్తుతూ జాలిగా ఉండటం మాకు చాలా ఇష్టం. మాయొక్క స్పెషాలిటీయే బ్యాక్ వర్డ్ కిక్. మాకు తెలియని వాళ్ళు మాకు సమీపంలోనికి వస్తే వాళ్ళను తన్నేసి మేము తప్పించుకొని మేము వెళ్లిపోతాం. కాని మా యజమానులకు మేము మంచి విశ్వాసులం. ప్రత్యేకంగా బరువులు మోయుటకు, మాపై మనుష్యులు కూర్చొని ప్రయాణం చేయుటకు మేము చాలా ఉపయోగ పడతాం.
ఒక రోజు నా జీవితంలో ఆశ్చర్యం మరియు అదే సమయంలో భయంతో కూడిన ఒక సంఘటన జరిగింది. నేను ఒక యూదుని మోయుచు యూదాలోనికి వెళ్తున్నాను. వెళ్లే దారిలో ఒక సింహం ఎదురైయింది. దానిని చూసి నేను వణికిపోయాను. అది ఆ వ్యక్తిని చంపేసింది. నన్ను మాత్రం ఏం చెయ్యకుండా నా దగ్గర నిలబడి ఉన్నది. తరువాత నేను అర్ధం చేసుకున్నాను నేను మోసుకొని వచ్చిన ఆ వ్యక్తి దేవుడు తనకు ఇచ్చిన సేవను పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు యెహోవా యొక్క స్వరమునకు లోబడకుండా ఆబద్దపు దీర్గదర్శనమును నమ్మి దేవుని మాటను నమ్మకుండా పోయాడు. ఇదే అతని మరణమునకు గల కారణం అని అర్ధం చేసుకున్నాను.
ప్రియమైన వారలారా! నేను దైవజనుడను మోసుకొని వెళ్లే గాడిదనే. అతడు యెహోవా మాటకు ఆలకింపక రాజైన యెరోబామునకు ప్రకటించింది వాస్తవమే. కాని అతనికి తప్పిపోయినది యెహోవా మాటకు లోబడకుండా ఆబద్దపు మాటలను నమ్ముటయే. ఇతను దేవుని మాటను సరిగానే ప్రకటించాడు, చక్కగా సేవచేసాడు కాని తన వ్యక్తిగత జీవితమును కోల్పోయాడు అలానే దేవుని మాటను అభ్యసించుటలో తప్పిపోయాడు.
ప్రియమైన వారలారా! మీరు కూడా దేవుని పరిచర్యే బాగా చెయ్యవచ్చు, యెహోవా మాటను చక్కగా ప్రసంగించ వచ్చు. కాని జీవితములో అభ్యసించడం చాలా ప్రాముఖ్యం. దానిలో మీరు తప్పిపోయినప్పుడు జీవితంలో మిక్కిలి బాధపడాల్సిన వ్యక్తిగా మారవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఏదో మీతో చెప్పాలి అని పించింది అందుకే చెప్పేసాను.
- బ్రదర్. కె. బెంజమిన్ గారు.
ప్రార్ధనా అంశం:-
తమిళనాడులో చర్చ్ లు లేని 1000 గ్రామాలలో చర్చ్ లు కట్టుటకు చేస్తున్న ప్రయాసలో దేవుని హస్తం తోడై యుండి నడిపించేలా ప్రార్దిద్ధాం.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250