Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Sunday, 27-Feb-2022

దిన ధ్యానము(Telugu) 27.02.2022 (God’s creation’s special)

అంశం:-  వజ్రం.

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

"జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను" - ఎఫెసీయులకు 3:19

ఒక పట్టణంలో ఒక మామ్మ పెద్ద ఇంట్లో అన్ని సౌకర్యాలు కలిగి జీవిస్తూ వచ్చారు. ఆమెకు ప్రతి రోజు సాయంత్రం వాకింగ్ కు వెళ్లడం అలవాటు. వాకింగ్ పూర్తి అయిన వెంటనే ఒక పార్క్ లో ఉన్న బెంచ్ పైన కూర్చొని చిన్న పిల్లలు అడుకొనుట చూసి సంతోషిస్తారు. మీకు కూడా సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి పార్కులో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కదా! అక్కడ అన్నయ్య, అక్క మాట్లాడుకొంటూ జాలీగా ఉంటారు కదా! అక్కడ ఎవరు మీకు తెలియకపోయిన గాని మీరు వాళ్ళతో కలిసి నవ్వుతూ సంతోషంగా ఆడుకుంటారు. అలాగే ఆ మామ్మ కూడా పిల్లలందరితో ప్రేమగా మాట్లాడతారు. ఇలా మామ్మకు చాలా మంది చిల్లపిల్లలు ఫ్రెండ్స్ అయిపోయారు. అందులో డైనా అనే పాప మామ్మతో చాలా అలవాటు అయిపోయింది. ఒక రోజు డైనా మామ్మతో మామ్మ మామ్మ రేపు నా పుట్టినరోజు మామ్మ మా నాన్న గొప్పగా సెలబ్రేట్ చేయబోతున్నారు మీరు ఖచ్చితంగా రావాలి అని పిలిచింది. డైనా మనవరాలి వలె చాలా ప్రేమతో మాట్లాడడంతో మామ్మ కూడా డైనా ను ప్రేమించి సరేనమ్మ వస్తాను అని చెప్పింది. పుట్టినరోజు నాడు డైమండ్ తొడిగిన ఉంగరమును ఒక బాక్స్ లో పెట్టి  పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు ఆ మామ్మ. బర్త్ డే పార్టీ పూర్తి అయి అందరు వెళ్లిపోయిన తరువాత గిఫ్ట్ బాక్సస్ అన్ని విప్పి చూస్తూ ఉన్నారు. అప్పుడే మామ్మ ఇచ్చిన ఉంగరం చూసింది డైనా. అబ్బా ఇది ఓల్డ్ మోడల్ గా ఉంది నాకు నచ్చలేదు అని పక్కన పెట్టేసింది. ఆ తరువాత వారంలో తన ఫ్రెండ్ మలర్ బర్త్ డే వచ్చింది. మలర్ కు మామ్మ ఇచ్చిన ఉంగరమును ఇచ్చేసింది డైనా. మలర్ వాళ్ళ నాన్న ఒక నగల వ్యాపారి డైనా ఇచ్చిన ఉంగరమును చూసి నీ ఫ్రెండ్ డైనా కు నీ పైనా ఎంత ప్రేమ ఉందొ చూడు ఇంత విలువైన ఉంగరమును నీకు బహుమతిగా ఇచ్చారు అని చెప్పారు. వెంటనే మలర్ డైనా కు ఫోన్ చేసి నీవు ఇచ్చిన బహుమతికి చాలా కృతజ్ఞతలు. నాకు చాలా విలువైనది ఇచ్చేసావు. నీ ప్రేమను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పిన వెంటనే డైనా కు మామ్మ గుర్తుకు వచ్చారు. మామ్మ యొక్క ప్రేమను, మామ్మ ఇచ్చిన బహుమతిని కోల్పోయాను అని డైనా చాలా బాధపడింది. 

పిల్లలు మరి యేసుక్రీస్తు తన ప్రాణమునే మన కొరకు ఇచ్చే అంతగా మనలను ప్రేమించారు. మామ్మ యొక్క ప్రేమను డైనా అర్ధం చేసుకోలేని విధముగా మనము కూడా అనేక సార్లు యేసయ్య యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని విధముగా ఉన్నాము. అయితే మీరు ఆయనను మరచిన యేసయ్య ఎన్నడు మిమ్మల్ని మరచిపోరు. కాబట్టి యేసయ్య కు ప్రతిరోజు థ్యాంక్స్ చెబుతూనే ఉండాలి. ఒకే నా! 
-    సిస్టర్. ఏ. బ్యూలా

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet