Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.03.2022
Share:

By Village Missionary Movement

Saturday, 05-Mar-2022

దిన ధ్యానము(Telugu) 05.03.2022

అంశం:-  దైవ భక్తి యొక్క. మేలు.

"యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు" - కీర్తనలు 128:1

ఈలోకంలో ఎక్కువ మంది మనుష్యులకు భయపడి జీవిస్తున్నారు. వీరు వారికంటే పై స్థాయిలో ఉన్న అధికారులను చూసినప్పుడు మంచి వారివాలె లోబడేవారివలె కనిపిస్తూఉంటారు. కాని తనను ఎవరూ చూడని సమయంలో పూర్తిగా వేరే జీవితంను జీవిస్తారు. కాని యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకొనేవారు ఈ లోకంలో చాలా తక్కువే. వీరు ఎవరు చూసిన చూడక పోయిన యెహోవా తనను చూస్తున్నారు అని ఉద్దేశ్యంతో ఆయనకు భయపడి ఆయన త్రోవలో నడుస్తారు. అవును వీరే ధన్యులు అని పరిశుద్ద గ్రంధం సెలవిస్తుంది. 

నేను దేవునికి బయపడువాడను అని ఆదికాండం 42:18 తనను గూర్చి ఒక వ్యక్తి దృఢమైన సాక్ష్యం పలికాడు. అతను ఎవరో గుర్తు వచ్చారా? అవును యోసేపే. ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించి చూపించాడు. వేరే దేశం మంచిగా బ్రతికితే పొగుడుటకు, చెడుగా బ్రతికితే శిక్షించడానికి తల్లిదండ్రులు, బంధువులు ఎవరు లేని స్థలం. ప్రేమకోసం ఆరాటపడే వయస్సు, వేరే స్థలం నుండి పిలుపు వినబడుతుంది అయినప్పటికీ నో చెప్పేసి పారిపోయాడు. ప్రత్యేకమైన అభిషేకమును పొందుకున్న సమ్సోను, దావీదు కూడా వ్యభిచార పాపములో పడిపోయారు. కాని యవ్వన వయస్సులో ఉన్న యోసేపు మాత్రం జయించాడు. చెడు కార్యానికి పిలిచిన వ్యక్తి రాజు అని ఊరియా బార్య కూడా లొంగిపోయింది. కాని యోసేపు మాత్రం యజమానురాలు అయితే ఏంటి తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి అందరి ముందు నేను చెడ్డవాడినైతే ఏంటి? తప్పు చేసే స్థలములో ఉండుట కంటే తప్పు చేయకుండా చెరసాలలో ఉండుట మేలు. నన్ను చూస్తున్న దేవుని దృష్టికి నా హృదయం మరియు శరీరం పరిశుద్ధంగా ఉంటే చాలు అని నిర్ణయించు కొన్నాడు యోసేపు. 

యెహోవాకు బయపడుట వలన పాపము నుండి తొలగి ఇంకా ధన్యుడిల మన కన్నుల ముందు వచ్చిన యోసేపుకు ఒక సెల్యూట్ కొడదమా? 

ప్రియమైన వారలారా! మనుష్యులకు కాదు యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకున్న మనుష్యుడు భుమి పై ధన్యుని వలె ఉంటారు. 128వ కీర్తనలో చెప్పబడిన విధముగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. ఉన్నతమైన ఆశీర్వదాం వారికి కలుగును. ఇటువంటి ఆశీర్వాదకరమైన జీవితం మీకు కావాలా? అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్.
-    శ్రీమతి. యబన్ సంతోష్ గారు

ప్రార్ధన అంశం:-
సహోదరుడు డేవిడ్ గణేషన్ గారి ప్రయాణాలలో దేవుని కాపుదల దయచేసే లాగున ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort