Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.03.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 06-Mar-2022

దిన ధ్యానము(Telugu) 06.03.2022 (Kids Special)

 

అంశం:-  నీ ఆశ ఏమిటి?

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా" - ఆదికాండము 12:3

 

హాలో పిల్లలు మీరు ప్రతి రోజు స్కూల్ కి వెళ్తున్నారు కదా? చాలా హ్యాపీ కదా. ఈరోజు ఒక స్కూల్ స్టోరీ విందమా?

 

చదువుకొంటున్న ముగ్గురు స్నేహితులుగా ఉండేవారు అంట. ఒకరోజు వారికి చాలా బోర్ కొడుతుంది అని వాకింగ్ కి వెల్లారంట. నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక ముసలాయన వచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అని అన్నారు. ఏ ప్రశ్న అనేకదా మీరు ఆలోచిస్తున్నారు  కదా? వాళ్ళు కూడా అలానే ఆలోచించారు. ఆ ముసలాయన మీరు జీవితంలో ఏమి అవ్వాలి అని ఆశ పడుతున్నారు అని అడిగారు. మొదటి అన్నయ్య, రెండవ అన్నయ్య బాగా చదవాలి, బాగా డబ్బులు సంపాదించాలి విద్యావేత్తలు అవ్వాలి అప్పుడే ఎక్కడకు వెళ్లిన మంచి ఉద్యోగం పొంది చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాని మూడవ అన్నయ్య ఏమి చెప్పాడో తెలుసా? చాలా మంది వ్యాధులతో బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక, బాధలతో వున్నారు వీరందరికి సహాయం చెయ్యాలి అని అనుకొంటున్నాను అని చెప్పాడు అంట. అప్పుడు ఆ పెద్దాయన సరే సరే మీరు కోరుకున్నట్టే జరగాలి అంటే మీరు ప్రార్ధన చేయాలి అని చెప్పి వెళ్లిపోయారంట ఆ ముగ్గురు అలాగే ప్రార్ధన చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత వాళ్ళు ఆశపడినట్లే జరిగింది. ఎక్కువ డబ్బులు అడిగిన అన్నయ్యకు నెమ్మదేలేదు. ఎక్కువ డబ్బులు ఉండటం వలన అతనికి నిద్ర రావడం లేదు అని బాధపడ్డాడంట విద్యావేత్త అవ్వాలని ఆశపడ్డ అన్నయ్య ఎక్కువ చదవటం వలన ఏ దారిలో వెళ్ళాలో తెలియక అయోమయతో కష్ట పడుతున్నాడంట. ఈ ఇద్దరూ కలిసి మూడవ అన్నయ్యను చూడటానికి వెళ్లారంట ఈ అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడంట నీ సంతోషమునకు కారణమేమిటి అడిగినప్పుడు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించినప్పుడు వారి వ్యాధి నయం అయ్యింది. అప్పుల బాదలలో ఉన్నవారికొరకు, కష్టపడే వారికొరకు ప్రార్ధించినప్పుడు అద్భుతం జరిగింది. ఇందువలన చాలామంది సంతోషంగా ఉన్నారు. అందుకే నేను సంతోషంగా ఉన్నానని చెప్పాడంట. ఈ దారి మాకు కనబడకుండా పోయింది. మా కొరకు కూడా ప్రార్ధించు అని చెప్పారంట. మా కొరకు కూడా ప్రార్ధించు అని తన స్నేహితునికి చెప్పి సంతోషమునకు దారి ఎరిగినవారై తన స్నేహితునివలె ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే తమ జీవిత ప్రయాణాలను మొదలు పెట్టారంట.

 

పిల్లలు మూడవ అన్నయ్య వలె  మీరుకుడా ఇతరులను సంతోషపరిచే జీవితాలను జీవించాలని యేసయ్య ఆశపడుతున్నారు.  మీరుకుడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారుకదా! వెరీగుడ్  సరే పిల్లలు మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారని నేర్చుకున్నాం. సరే ఇప్పుడు కంఠత వాక్యం నేర్చుకుందామా?

  • సహోదరి. దేబోరాల్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet